కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

నర్సంపేట(ఖానాపురం),నవంబర్ 26 : తెలంగాణ ప్రాంతంలోని రైతులను ప్రభుత్వం ఆదుకుంటున్నదని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి అన్నారు. గురువారం ఖానాపురంలోని కొత్తూరు, ఐనపెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కొనుగోలు కేంద్రా ల్లోనే రైతులకు మద్దతు ధర చెల్లిస్తారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపెల్లి ప్రకాశ్‌రావు, వెంకట్‌రెడ్డి, ఏడీఏ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట సొసైటీ ఆధ్వర్యంలో ఉప్పరపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట ఏడీఏ తోట శ్రీనివాసరావు, ఎంపీపీ బాదావత్ విజేందర్, చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి ప్రారంభించారు. సొసైటీ వైస్ చైర్మన్ చింతకింది వంశీ, సర్పంచ్ పెరుమాండ్ల శ్రీధర్‌రెడ్డి, ఎంపీటీసీ చెరుకుపెల్లి విజేందర్‌రెడ్డి, ఏవో కర్పూరపు అనిల్‌కుమార్, ఏఈవో వినయ్, సొసైటీ డైరెక్టర్లు జంగిలి రాజు, మజ్జిగ రాంబాబు, కంచె రాంచంద్రు, జున్నుతుల మహేందర్‌రెడ్డి, చింతల జయేందర్‌రెడ్డి, అందె వెంట్రాములు, మాజీ సర్పంచ్ అందె వీరయ్య, వెంకటేశ్వర్లు, రైతుబంధు సమితి కన్వీనర్ మంతుర్తి అన్వేశ్, మోర ఆగయ్య, సీఈవో చిట్టె రవి పాల్గొన్నారు.
రైతు వేదిక నిర్మాణ పనుల పరిశీలన
రైతు వేదిక భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని నర్సంపేట ఏడీఏ తోట శ్రీనివాసరావు అన్నారు. గురువారం మండలంలోని ఉప్పరపల్లిలో వేదిక నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
నర్సంపేట రూరల్ :
మండలంలోని ఇటుకాలపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట పీఏసీఎస్ చైర్మన్ మొరాల మోహన్‌రెడ్డితో పాటు సర్పంచ్ మం డల రవీందర్, ఉప సర్పంచ్ జమాండ్ల చంద్రమౌళి, ఎంపీటీసీ భూక్యా వీర న్న, సొసైటీ వైస్ చైర్మన్ మేర్గు శ్రీనివాస్, సంఘం డైరెక్టర్లు దామెర రవి, పెసరు సాంబరాజ్యం, జనార్దన్, వెంకటమ్మ, సుప్రజ, తిరుపతి, రాము, లక్ష్మణ్, సీఈవో జక్కుల మధు ప్రారంభించారు.
దుగ్గొండి : మండలంలోని ముద్దునూరు, లక్ష్మీపురం, బొబ్బరోనిపల్లి గ్రామాల్లో డీఆర్డీఏ సెర్ప్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య ప్రారంభించారు. కార్యక్రమం లో ఏపీఎం రాజ్‌కుమార్, సర్పంచ్ లు రేవూరి సురేందర్‌రెడ్డి, పాండవుల సురేందర్, శంకేసి శోభాకమలాకర్, ఎంపీపీటీలు కొంగర అరుణరవి, మామునూరి సుమన్, సీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, సీసీలు పాల్గొన్నారు.
దామెర: మండలంలోని పసరగొండలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏవో కమలాకర్, ఏఈవో పవన్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: మండలంలోని నీరుకుళ్ల, పెంచికలపేట, కామారం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ కంది శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీవో పరమేశ్వర్, నోడల్ ఆఫీసర్ నారాయణ, ఏవో యాదగిరి, డీటీ వినోద్, సర్పంచ్‌లు, సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
పర్వతగిరి : దౌలత్‌నగర్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్ నిర్వహిస్తుండగా దీనిని ఐకేపీకి కేటాయించడంతో వారు కొనుగోళ్లు నిర్వహించడం లేదని రైతులు ఆందోళన చేపట్టారు. ఐకేపీ ఏపీఎం కృష్ణమూర్తి, సీసీలు సెంటర్‌ను ప్రారంభించడంతో శాంతించారు.
తాజావార్తలు
- ఆ ఆరోపణలు క్రేజీగా ఉన్నాయి: బిల్ గేట్స్
- ప్రియురాలితో గొడవపడి సముద్రంలో దూకిన యువకుడు
- పల్లె ప్రకృతివనం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ప్రారంభించిన మంత్రి
- యాదాద్రి పనుల తీరుపై మంత్రి అసంతృప్తి.. అధికారులపై ఆగ్రహం
- గంగూలీకి మళ్లీ ఛాతీలో నొప్పి
- కర్ణాటక సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర బుక్ రిలీజ్
- ముష్కరుల దాడి.. నలుగురు జవాన్లకు గాయాలు
- ఐపీఎల్-2021 మినీ వేలం తేదీ, వేదిక ఖరారు
- థాంక్యూ ఇండియా : నేపాల్ ప్రధాని ఓలీ
- ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లు దాటిన కోవిడ్ కేసులు