రుణాల మంజూరులో రాష్ట్రంలోనే రూరల్ జిల్లా అగ్రస్థానం

- బ్యాంక్ అధికారులను అభినందించిన కలెక్టర్ హరిత
కలెక్టరేట్: వీధి వ్యాపారులకు 96.16 శాతం రుణాలు మంజూరు చేయడంలో రాష్ట్రంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలిపినందుకు బ్యాంక్ అధికారులను కలెక్టర్ హరిత అభినందించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా లో 3,598 వీధి వ్యాపారులకు 3,460 మందికి రుణాలు అందించిన బ్యాంక్ అధికారులను అభినందించారు. ఇప్పటివరకు క్రాఫ్ లోన్లకు రూ.1180 కోట్లకు రూ. 663 కోట్లు బ్యాంక్‌ల ద్వారా అందజేశారని, ప్రాధాన్యత రంగాలకు రూ. 2100 కోట్ల లక్ష్యాలకు రూ. 913 కోట్లు, పరిశ్రమలకు రూ. 469 కోట్ల లక్ష్యాలకు రూ.117కోట్లు ఇచ్చారన్నారు. ఇంకా లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ తెలిపా రు. రబీలో క్రాప్‌లోన్స్ రూ.471 కోట్ల లక్ష్యాలకు బ్యాం కులు రూ. 126 కోట్లు మాత్రమే ఇచ్చారని, కారణం తెలపాలని కలెక్టర్ అడుగగా, బ్యాంకర్లు మాట్లాడుతూ ధరణి పోర్టల్ సమస్య వల్ల రుణాల మంజూరు ఆలస్యమైందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ (ఎంఎస్ఎంఈ ) ద్వారా పరిశ్రమలకు 92 శాతం రుణాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో ఆర్బీఐ ఎల్డీవో ఫణిరాజ్, ఎల్డీఎం సత్యజిత్, డీడీఎం క్రుష్ణమూర్తి, డీజీఎం శంకర్‌లాల్, ఆర్ఎంలు రామక్రుష్ణ, జోషి, రాజు, ఇతర బ్యాంక్ అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కల్లాల ఉపయోగంపై అవగాహన కల్పించాలి
జిల్లాలోని రైతులకు కల్లాల ఉపయోగంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎం హరిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, గీసుగొండ, సంగెం మండలాల ఎంపీడీవోలు, ఏవోలు, ఏఈవోలు, ఉపాధి హామీ సిబ్బందితో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులందరిని ఒక చోట సమావేశ పరచి కల్లాల నిర్మాణాలు, వాటి మార్కింగ్, కొలతల గురించి టెక్నికల్ అసిస్టెంట్లు వారికి తెలపాలన్నారు. డిసెంబర్ మొదటి వారంలోగా కల్లాల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పని చేసి రైతులు కల్లాలను త్వరగా నిర్మించుకునేలా చొరవ చూపాలన్నారు. డీఆర్డీవో పీడీ సంపత్‌రావు, అగ్రికల్చర్ జేడీ ఉషాదయాళ్ మండలాల ఎంపీడీవోలు, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని
- ట్రంప్ ఆర్డర్లన్నీ రివర్స్.. బైడెన్ చేయబోయే తొలి పని ఇదే
- బైకును ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి
- ఆచార్యలో ‘సిద్ధ’గా రాంచరణ్.. లుక్ రివీల్
- అనంతగిరి కొండలను కాపాడుకుందాం..
- 'కుట్రతోనే రైతుల విషయంలో కేంద్రం కాలయాపన'
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్
- వాట్సాప్ కొత్త స్టేటస్ చూశారా?
- ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత