మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Nov 26, 2020 , 02:21:54

ఆధునిక హంగులతో పరకాల

ఆధునిక హంగులతో పరకాల

  • సెంట్రల్‌ లైటింగ్‌, అంతర్గత రోడ్లతో మారిన పట్టణ రూపురేఖలు
  • రూ.5కోట్లతో తహసీల్‌, ఆర్డీవో కార్యాలయాలు
  • ఆధునిక హంగులతో షాపింగ్‌ కాంప్లెక్స్‌
  • ముమ్మరంగా సాగుతున్న పనులు
  • కొత్త హంగులతో తహసీల్‌, ఆర్డీవో కార్యాలయాలు

అధికారులు, సిబ్బంది, ప్రజలకు అవసరమైన అన్ని వసతులుండడంతోపాటు అధునాతన హంగులతో రాష్ట్ర సర్కారు ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా పరకాల పట్టణంలో తహసీల్‌, ఆర్డీవో కార్యాలయాలు కొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. సుమారు రూ.5 కోట్లతో పాత తహసీల్‌ కార్యాలయ ఆవరణలో నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో పాటు పట్టణంలోని వెల్లంపల్లి రోడ్డులో చిరువ్యాపారుల కోసం మొదటి విడుతగా రూ.కోటి నిధులతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే పట్టణంలోని చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరుతుంది.

పరకాల : పరకాల పట్టణం అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్నది. ఇప్పటికే రెవెన్యూ డివిజన్‌గా మారిన పట్టణం, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చొరవతో ప్రగతి దారి లో పయనిస్తున్నది. సెంట్రల్‌ లైటిం గ్‌, అంతర్గత రోడ్ల నిర్మాణంతో పట్ట ణం రూపురేఖలు మారగా, తహసీల్‌ ఆఫీస్‌, ఆర్డీవో కార్యాల యం, షాపింగ్‌ కాంప్లెక్స్‌ను నయా లుక్‌తో నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలు పూర్తయితే మరింత శోభను సంతరించుకోనుంది. దీంతోపాటు వరంగల్‌ రూరల్‌, ములుగు, భూపాలపల్లి జిల్లాల మిషన్‌ భగీరథ కార్యాలయ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో 20 గుంటల భూమిని కేటాయిస్తూ ఇటీవలే మండల సభ తీర్మానం చేసింది. భగీరథ కార్యాలయానికి స్థలం కేటాయింపుమూడు జిల్లాల మిషన్‌ భగీరథ కార్యాలయా నిర్మాణానికి పట్టణంలో నిర్మిస్తున్నారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో 20 గుంటల భూమిని కేటాయిస్తూ ఇటీవలే మండల సభలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. వరంగల్‌ రూరల్‌ (పరకాల నియోజకవర్గం), జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల మిషన్‌ భగీరథ కార్యాలయాన్ని (అడ్మినిస్ట్రేషన్‌ కమ్‌ మానిటరింగ్‌ బిల్డింగ్‌) నిర్మించేందుకు అధికారులు ఇప్పటికే రూ.2.9కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక డివిజన్‌ కార్యాలయం, రెండు సబ్‌ డివిజనల్‌ కార్యాలయాలతో పాటు నీటి పరీక్ష కేంద్రం(ల్యాబ్‌)ను నిర్మించనున్నారు. ప్రాజెక్టు అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌ (పీఏబీ) ద్వారా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఈఈ)హోదా గల అధికారి పర్యవేక్షణ చేపట్టనున్నారు. పారదర్శకంగా ప్రజలకు సేవలు 

పరకాల పట్టణంలో నూతన కార్యాలయాల ఏర్పాటుతో మరింతగా పారదర్శకంగా ప్రజలకు సేవలు అందుతాయి. మిషన్‌ భగీరథ సేవలపై అధికారుల పర్యవేక్షణ మెరుగుపడుతుండడంతో నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తవు. రిజిస్ట్రేషన్ల కోసం పట్టణానికి వచ్చే రైతులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయి. 

- చింతిరెడ్డి మధుసూదన్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ, పరకాల

అభివృద్ధి బాటలో పరకాల పట్టణం

నూతన కార్యాలయాల నిర్మాణంతో పట్టణం మరింత అభివృద్ధి చెందనుంది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతర్గత రోడ్ల నిర్మాణం, ప్రధాన రోడ్లపై సెంట్రల్‌ లైటింగ్‌, హరితహారం మొక్కలతో పట్టణ రూపురేఖలు మారాయి. రానున్న రోజుల్లో పరకాల అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుస్తుంది.  

- సోదా అనిత రామకృష్ణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, పరకాల మున్సిపాలిటీ


logo