గురువారం 03 డిసెంబర్ 2020
Warangal-rural - Nov 23, 2020 , 02:35:23

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  • సన్న వడ్లకు బోనస్‌ 
  • వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి

శాయంపేట : రైతు సంక్షేమమే ధ్యేయం గా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి అన్నా రు. మండల పరిధిలోని పత్తిపాక, శాయంపే ట, పెద్దకోడెపాక గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ఆమె ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌ అన్నదాత క్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఇబ్బడిముబ్బడిగా వస్తున్న ఒకే రకమైన పంట దిగుబడిని తగ్గించి రైతులకు ఆదాయం పెరిగేందుకు నియంత్రి సాగును అమల్లోకి తెచ్చారన్నారు. సన్నవడ్ల సాగును చేపట్టాలని సూచించారన్నారు. అయితే అధి క వర్షాలతో కొంతమేర దిగుబడి తగ్గిందన్నా రు. ఈ నేపథ్యంలో సన్న వడ్లకు మద్దతు ధర ఇవ్వాలని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పె ట్టడం వల్లే సన్న వడ్లకు ధర పెంచలేకపోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక సన్న వడ్లకు సీఎం కేసీఆర్‌ బోనస్‌ ప్రకటిస్తారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రైతు లు పండించిన వడ్లను ప్రభుత్వమే కొనుగో లు చేస్తున్నదన్నారు. మద్దతు ధర ప్రకటించి కొంటున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చుతున్న ప్రభుత్వంపై విమర్శలు చేయ డం సరికాదన్నారు. రైతుబంధుతో పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. రైతులు ఎలా చనిపోయినా రూ.5 లక్షలు రైతుబీమా కింద ఇస్తూ ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా ప్రభుత్వం నిలబడుతున్నదన్నారు. ఆపదలో ఇంతకంటే సాయం మరో టి ఉండదన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతులకు రైతుబంధు డబ్బులు అందించిన ఘనత సీఎందేనని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేసి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. గతంలో పొలాలు బీడుగా మారితే నేడు ప్రతి గుంట సాగులోకి వచ్చిందన్నారు. ఎస్సారెస్పీ నీళ్ల కోసం గతంలో ఎదురుచూసేవారని, ఇప్పుడు వద్దని చెబుతున్నా గలగలాపారుతున్న పరిస్థితి ఉందన్నారు. ఇంతకన్నా రైతులకు ఏం కావాలని ప్రశ్నించారు. రైతును రాజుగా మార్చుతున్న కేసీఆర్‌కు ప్రతి ఒక్కరూ అండగా నిలువాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధా న్యాన్ని విక్రయించాలన్నారు. పత్తిని సీసీఐ కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధర పొందాలన్నారు. దళారులకు అమ్ముకుంటే నష్టం వ స్తుందన్నారు. మండల పరిధిలో కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, పరకాల ఏఎంసీ చైర్మన్‌ బొజ్జం రమేశ్‌, రైతుబం ధు సమితి కో ఆర్డినేటర్‌ కర్ర ఆదిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ జర్పుల తిరుపతినాయక్‌, ఎంపీటీసీ వావిలాల వేణు, ఎంపీడీ వో కృష్ణమూర్తి, ఏవో గంగాజమున, సర్పంచ్‌లు చిట్టిరెడ్డి రాజిరెడ్డి, రవి, అబ్బు ప్రకాశ్‌రెడ్డి, ఏపీఎం శ్రీధర్‌రెడ్డి, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.