శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-rural - Nov 21, 2020 , 01:07:45

గ్రేటర్‌ ఎన్నికలకు తరలిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

గ్రేటర్‌ ఎన్నికలకు తరలిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

పరకాల: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారానికి మండలంలోని టీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం తరలివెళ్లారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి రామంతపూర్‌ డివిజన్‌ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరకాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సోదా అనితా-రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన నాయకులు, వైస్‌ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలానికి చెందిన నాయకులు వాహనాల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. తరలివెళ్లిన వారిలో ఐఆర్‌సీఎస్‌ జిల్లా సభ్యుడు బండి సారంగపాణి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ బొచ్చు వినయ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆముదాలపల్లి అశోక్‌, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ ఏరుకొండ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పసుల రమేశ్‌, మార్క రఘుపతి, మడికొండ శ్రీనివాస్‌, నల్లెల్ల అనిల్‌, విష్ణవర్ధన్‌, ఇంగిలి వీరేశ్‌ ఉన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం

నడికూడ: హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అఖండ విజయం సాధిస్తుందని పార్టీ మండలాధ్యక్షుడు భీమిడి నాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగే ఎన్నికల ప్రచారానికి మండల ప్రధాన కార్యదర్శి దురిశెట్టి చంద్రమౌళి, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ బొల్లె భిక్షపతి, నాయకులు మచ్చ రవీందర్‌, కే కరుణాకర్‌ తరలివెళ్లారు.