ఆదివారం 29 నవంబర్ 2020
Warangal-rural - Nov 20, 2020 , 01:50:48

చిరువ్యాపారుల కోసమే షాపింగ్‌ కాంప్లెక్స్‌

చిరువ్యాపారుల కోసమే షాపింగ్‌ కాంప్లెక్స్‌

పరకాల: చిరువ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, ఇందులో భాగంగానే పట్టణంలో ఆధునాతన వసతులతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సోదా అనితా రామకృష్ణ అన్నారు. పట్టణంలోని వెల్లంపల్లి రోడ్డులో రూ. కోటితో నిర్మించనున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌కు ఆమె గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం అనిత మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో చిరువ్యాపారుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చర్యలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగానే కాంప్లెక్స్‌ నిర్మాణానికి తొలి విడుతగా కోటి రూపాయలు వెచ్చిస్తున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రేగూరి విజయపాల్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ యాదగిరి, కౌన్సిలర్లు మడికొండ సంపత్‌కుమార్‌, ఒంటేరు సారయ్య, పొరండ్ల సంతోష్‌, స్రవంతి, దామెర మొగిలి, నల్లెల్ల జ్యోతి-అనిల్‌, అడప రాము, పసుల లావణ్య-రమేశ్‌, బండి రాణి, సదానందం, శనిగరపు రజిని-నవీన్‌, మార్క ఉమ-రఘుపతి, చందుపట్ల సుజాత-తిరుపతిరెడ్డి, పాలకుర్తి గోపి, ఏకు రాజు, కో ఆప్షన్‌ సభ్యురాలు పాడి నవత-భగవాన్‌రెడ్డి, ఐఆర్‌సీఎస్‌ జిల్లా సభ్యుడు బండి సారంగపాణి, షబ్బీర్‌ అలీ, ముఫీనా ఫాతిమా హమీద్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నక్క చిరంజీవి, ఇంగిళి వీరేశ్‌, బండి నరేశ్‌, ఏకు సుభాష్‌, పొరండ్ల రమేశ్‌, కలీమ్‌ పాల్గొన్నారు.