మంగళవారం 24 నవంబర్ 2020
Warangal-rural - Nov 19, 2020 , 02:06:11

బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు

బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు

రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత

కలెక్టరేట్‌, నవంబర్‌ 18 : జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం చేయవద్దని కలెక్టర్‌ హరిత జిల్లా పంచాయతీరాజ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో రైతు వేదికల నిర్మాణాలు, పేమెంట్‌ అంశాలపై  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 74 రైతు వేదికల నిర్మాణాలను చేపట్టగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అనుకున్న సమయానికి పూర్తి చేసినట్లు చెప్పారు. సమావేశంలో అగ్రికల్చర్‌ జేడీ ఉషాదయాళ్‌, ఏడీలు, పంచాయతీరాజ్‌ ఈఈ శంకరయ్య, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.   

ప్రకృతి వనాల పనులను ముమ్మరం చేయాలి 

నెక్కొండ : గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు ముమ్మరం చేయాలని కలెక్టర్‌ హరిత సూచించారు. నెక్కొండ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ జాటోత్‌ రమేశ్‌ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్‌ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలకు త్వరగా స్థల సేకరణ పూర్తి చేయాలని తహసీల్దార్‌ డీఎస్‌ వెంకన్న, ఎంపీడీవో సాహితీమిత్రలను ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్‌ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పంచాయతీ కార్యదర్శి తమ ప్రాంతం నుంచి నిత్యం ఆప్‌లో ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలన్నారు. కార్యదర్శుల పనితీరును సమీక్షించే పర్యవేక్షణ అధికారులు కూడా ఫొటోలను అప్‌లోడ్‌ చేయాల్సిందేనన్నారు. కార్యదర్శులు, అధికారులు తక్షణం తమ పనితీరును మార్చుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ సంపత్‌రావు, వైస్‌ ఎంపీపీ రామారపు పుండరీకం