శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Nov 17, 2020 , 02:10:08

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల : పట్టణంలో చేపడుతున్న తహసీల్‌, ఆర్డీవో కార్యాలయ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సుమారు రూ.5కోట్ల నిధులతో చేపడుతున్న ఈ పనులను అధికారులు, కాంట్రాక్టర్‌తో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు, ప్రజల సౌకర్యార్థం అన్ని హంగులతో కార్యాలయ భవనాలను అధునాతనంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడేది లేదన్నారు. ధరణి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారికి అసౌకర్యం కలుగకుండా భవనంలో ప్రత్యేక గది నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పరకాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు.  

కుంకుమేశ్వర ఆలయంలో పూజలు

కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జ్యోతి దంపతులు శ్రీ భవానీ కుంకుమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆధ్వర్యం లో నిర్వహించిన మహా అన్నదానాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సోదా అనితా రామకృష్ణ, వైస్‌ చైర్మన్‌ రేగూరి విజయపాల్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ బొల్లె భిక్షపతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బొచ్చు వినయ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బొజ్జం రమేశ్‌, కౌన్సిలర్లు వండి రమాదేవి సారంగపాణి, మార్క ఉమా రఘుపతి, పసుల లావణ్య రమేశ్‌, బండి రాణి సదానందం, దామెర మొగిలి, నల్లెల్ల జ్యోతి అనిల్‌, శనిగరపు రజినీ నవీన్‌, జడ్పీటీసీ మొగిలి, ఎంపీపీ స్వర్ణలత 

 స్థలం కేటాయించాలని వినతి

సంగెం : టెక్స్‌టైల్‌ పార్కులో మరమగ్గం ఉత్పత్తి కోసం వంద ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ శ్రీ వినాయక టెక్స్‌టైల్‌ సహాయ పరస్పర సహకార సంఘం సభ్యులు సోమవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఆయ న నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి స్థలం కేటాయించేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు మన్న కుమార్‌, యార సుదర్శన్‌, బాసాని శంకర్‌, కొంగ సమ్మయ్య, మురళి, బుడిగె సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.