బుధవారం 02 డిసెంబర్ 2020
Warangal-rural - Nov 13, 2020 , 06:12:49

మనోజ్‌ లైఫ్‌స్కిల్‌ ప్రాజెక్టుకు అరుదైన గౌరవం

మనోజ్‌ లైఫ్‌స్కిల్‌ ప్రాజెక్టుకు అరుదైన గౌరవం

  • పుస్తక హోదా కల్పించిన ఢిల్లీ యూనివర్సిటీ

శాయంపేట : శాయంపేటకు చెందిన లైఫ్‌స్కిల్‌ ట్రైనర్‌ మారెపల్లి మనోజ్‌కు అరుదైన గౌరవం ల భించింది. ఢిల్లీ విద్యార్థుల కోసం లైఫ్‌స్కిల్‌పై ప్రా జెక్టును పంపించాలని ఢిల్లీ యూనివర్సిటీ కోరిం ది.


కాగా, మానవుడి మనుగడ, జీవిత నైపుణ్యాలపై మనోజ్‌ 16 పేజీల పుస్తకాన్ని ఢిల్లీ బేస్డ్‌ విద్యార్థుల కోసం ప్రాజెక్టు కింద పంపించారు. మనోజ్‌ పుస్తకాన్ని పరిశీలించిన యూనివర్సిటీ ప్రొఫెసర్లు భవిష్యత్‌లో విద్యార్థులకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని గుర్తించి బోధన కోసం ఎంపిక చేసినట్లు మనోజ్‌ గురువారం చెప్పారు. తన ప్రాజెక్టు జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు.