శుక్రవారం 27 నవంబర్ 2020
Warangal-rural - Nov 13, 2020 , 06:11:44

డిప్యూటీ సీఈవోగా బాలకృష్ణ

డిప్యూటీ సీఈవోగా బాలకృష్ణ

వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ: జిల్లా ప్రజా పరిషత్‌ డిప్యూటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో)గా పీ బాలకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన పరకాల ఎంపీడీవోగా పని చేస్తున్నారు. బాలకృష్ణకు జడ్పీ డిప్యూటీ సీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతిని బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు జడ్పీ అధికారులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.