గురువారం 26 నవంబర్ 2020
Warangal-rural - Nov 13, 2020 , 06:11:45

మందుబాబులకు చెక్‌..

మందుబాబులకు చెక్‌..

  • డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు షురూ..
  • కొవిడ్‌ కారణంగా నిలిపివేసిన పోలీసులు
  • ఎనిమిది నెలల తర్వాత తిరిగి ప్రారంభం
  • ముమ్మరంగా పోలీసుల తనిఖీలు
  • గతేడాదితో పోల్చితే తగ్గిన ఆదాయం

హన్మకొండ చౌరస్తా : ఇంకెక్కడి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ అంటూ తాగి వాహనం నడిపితే అంతే సంగతులు. మందుబాబులకు ముచ్చెమటలు పట్టించే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ కారణం గా ఇన్ని రోజులు ఈ తనిఖీలు నిలిపివేయడంతో మందుతాగి వాహనాలు నడిపేవారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. పెగ్గు మీద పెగ్గేసి దర్జాగా వాహనాలు నడిపారు. ఇక నుంచి ఆ ఆటలు సాగవు. కొవిడ్‌ నేపథ్యంలో నిలిచిపోయిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ను పోలీసులు షురూ చేశారు. సుమారు ఎనిమి ది నెలల తర్వాత మళ్లీ తనిఖీలు ప్రారంభించారు. నాలుగు రోజుల్లో ఎనిమిది కేసులు న మోదు చేశారు. ఇంతకుముందు తాగి దొరికితే ఫైన్‌ కట్టించుకుని వదిలేసేవారు. ఇప్పు డు తల్లిదండ్రులు, భార్య సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించి, కోర్టు బోను ఎక్కిస్తున్నా రు. వచ్చిన రీడింగ్‌ను బట్టి మెజిస్ట్రేట్‌ ఫైన్‌తో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

ప్రమాదాలను అరికట్టేందుకే..

మద్యపాన వ్యసనం వల్ల అనేక మంది జీవితాలు నాశనమవుతున్నాయి. మద్యం మత్తు లో డ్రైవింగ్‌ చేయడంతో ప్రమాదాలు జరిగి ఇతరుల ప్రాణాలకూ ఆపద వాటిల్లుతున్న ది. తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అ నర్థాలపై ప్రజలకు పోలీసులు అవగాహన క ల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మ ద్యం మత్తులో డ్రైవింగ్‌ చేసే వారికి తప్పు చే స్తున్నామనే భావన కలిగించడానికి భారీ జరిమానాలను విధిస్తున్నారు. దాదాపుగా 30 శాతం రోడ్డు ప్రమాదాలు డ్రంక్‌ అండ్‌ డ్రై వింగ్‌ వల్లే జరుగుతున్నాయి. ఇలా ఏటా ల క్షలాది మంది తమ జీవితాలను నాశనం చే సుకుంటున్నారు. అనేక అధ్యయనాల్లో ఈ ప్రమాదాలు పగటి కంటే రాత్రి సమయంలోనే ఎక్కువ జరుగుతున్నాయని తేలింది.

ముమ్మరంగా పోలీసుల తనిఖీలు..

హన్మకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మందుబాబులకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు రాత్రివేళ ముమ్మరంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్నారు. కొవిడ్‌ కారణంగా మార్చి నుంచి ఈ తనిఖీలు నిలిపివేశారు. గత సంవత్సరం డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌లో 1,174 కేసులు నమోదు కాగా, జరిమానాల ద్వారా రూ.14 లక్షలకుపైగా ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం అక్టోబర్‌ 31 వరకు 295 కేసులు నమోదు కాగా రూ.2,33,600 ఆదాయం మాత్రమే సమకూరింది. కొవిడ్‌ కారణంగా కేసులతో పాటు ఆదాయం కూడా తగ్గడం విశేషం.

తాగి వాహనం నడుపొద్దు..

- విజయ్‌కుమార్‌, హన్మకొండ సీఐ

 మద్యం తాగి వాహనాలు నడుపొద్దు. తాగి పట్టుబడితే తల్లిదండ్రులు, భార్య సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాం. అలాగే, కోర్టులో రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు ఫైన్‌తో పాటు జైలు శిక్ష పడుతుంది. నాలుగు రోజుల్లో 8 వరకు కేసులు నమోదు చేశాం. గతేడాదితో పోలిస్తే ఈసారి కొవిడ్‌ కారణంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులతో పాటు ఆదాయం కూడా తగ్గింది.