రైతు సంక్షేమమే ధ్యేయం..

- ప్రతి మండలానికి గోదాములు
- రూ.600 కోట్లతో రైతువేదికల నిర్మాణం
- ధర్నాలు చేస్తే బీజేపోళ్లను తరిమికొట్టాలి
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- గవిచర్ల, తీగరాజుపల్లిలో రైతువేదికలు, పల్లె ప్రకృతి వనం ప్రారంభం
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలోని తీగరాజుపల్లి, గవిచర్ల గ్రామాల్లో రైతు వేదికలు, గవిచర్లలో పల్లె ప్రకృతి వనాన్ని గురువారం ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంటలు వేసే విషయమై చర్చించేందుకు రాష్ట్రంలో 2601 క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మిస్తున్నామని, అలాగే 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్రతి మండలంలో గోదాములు కట్టిస్తామని చెప్పారు.
సంగెం : రైతుల సంక్షేమమే ధ్యేయమని, పంట సాగు కోసం పెట్టుబడి సాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సంగెం మండలం తీగరాజుపల్లి, గవిచర్ల గ్రామాల్లోని రైతు వేదికలు, గవిచర్లలో పల్లె ప్రకృతి వనాన్ని గురువారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. బతుకమ్మ, బోనాలతో మహిళలు, సంప్రదాయ నృత్యాలతో కళాకారులు ముందునడవగా, ఎర్రబెల్లి ఎడ్లబండి నడుపుతూ రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. పూజారులు ఆయన పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవిచర్లలో ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో 2,601 క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మించామన్నారు. రూ.600 కోట్లతో రైతు వేదికలు నిర్మిస్తున్నామని, వాటిలో రైతులు సమావేశమై ఏయే పంటలు వేసుకోవాలో అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి మండలానికి 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు నిర్మిస్తామని తెలిపారు. దేవాదుల కాల్వ కోసం ఎమ్మె ల్యే ధర్మారెడ్డి సొంతంగా రూ.కోటీ 20లక్షలు ఖర్చు చేసి సంగెం మం డల రైతులకు సాగు నీరు తీసుకొచ్చాడని, అలాంటి ఎమ్మెల్యే దొరకడంప్రజలఅదృష్టమన్నారు. కేంద్ర ప్రభుత్వం కరంటు మోటర్లకు మీటర్లు పెడితే ఏడాదికి లక్ష రూపాయల బిల్లు వస్తుందని, అప్పుడు రైతు పండించిన పంట బిల్లుకే సరిపోదన్నారు. గిట్టుబాటు ధర కోసం బీజేపోళ్లు ధర్నాలు చేస్తే తరిమికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. కరంటు మోటర్లకు మీటర్లు పెట్టే విషయం నిజం కాదా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. దుబ్బాకలో బీజేపీ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. జిల్లాలో 65 రైతువేదికల నిర్మాణం పూర్తయిందని, మిగతా పది త్వరలోనే పూర్తి చేస్తామని కలెక్టర్ హరిత తెలిపారు. కార్యక్రమంలో రూరల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ కందకట్ల నరహరి, సర్పంచ్‌లు దొనికెల రమశ్రీనివాస్, ఖర్జుగుత్త రమాగోపాల్, బోంపెల్లి జయశ్రీ, గు గ్లోత్ మంగ్యానాయక్, సట్ల రాజు, కిశోర్‌యాదవ్, స ర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు పులుగు సాగర్‌రెడ్డి, ఎంపీటీసీలు రంగరాజు నర్సింహాస్వామి, గూడ సంపత్‌రెడ్డి, చిదిరాల రజిత, అడ్డగట్ల దుర్గారావు, సుతారి బాలకృష్ణ, రెడ్‌క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఆర్డీవో మహేందర్‌జీ, డీఆర్డీవో సంపత్‌రావు, పీఆర్ ఈఈ సంపత్, జేడీఏ ఉషాదయాల్, ఏవో సీహెచ్ యాకయ్య, మార్కెట్ చైర్మన్ చింతం సదానందం, డైరెక్టర్ దోపతి సమ్మయ్యయాదవ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, కూస కరుణాకర్, చిరంజీవి, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో మల్లేశం, సొసైటీ చైర్మన్ సంపత్, సాంబయ్య, గోవర్దన్‌గౌడ్, దిలీప్‌రావు, మాజీ ఎంపీపీ వీరాచారి పాల్గొన్నారు.
రైతుబిడ్డ కావడం మన అదృష్టం
రైతు బిడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మనందరి అదృష్టం. కరోనా కష్టకాలంలో ప్రతి గింజనూ కొనుగోలు చేసి అండగా నిలిచాం. పరకాల నియోజకవర్గంలో 16 రైతు వేదికలు పూర్తయ్యాయి. మరో 8 పది రోజుల్లో పూర్తి చేస్తాం. జిల్లాలో మొట్టమొదటి రైతువేదికను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది.
- పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కాళేశ్వరంతో చెరువులకు జలకళ
కాళేశ్వరం జలాలతో చెరువులన్నీ కళకళలాడుతున్నాయి. రాష్ట్రం ఏర్పడక ముందు సరిపడా కరెంటు, సాగు నీరు లేక రైతులు అరిగోస పడ్డారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆ బాధలు తీరాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో చెరువులన్నీ మత్తడిపోస్తున్నాయి.
- ఎంపీ పసునూరి దయాకర్
తాజావార్తలు
- రామ మందిరానికి వజ్రాల వ్యాపారుల రూ.17 కోట్ల విరాళాలు
- ఆఫ్ఘన్లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయావతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ