ఆదివారం 29 నవంబర్ 2020
Warangal-rural - Nov 11, 2020 , 02:38:38

మావోయిస్టు సునీల్‌ జనజీవన స్రవంతిలో కలువాలి

మావోయిస్టు సునీల్‌ జనజీవన స్రవంతిలో కలువాలి

 మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్‌ జే రవికిరణ్‌

ఖిలావరంగల్‌, నవంబర్‌ 10 : అజ్ఞాతంలో ఉన్న లేబర్‌కాలనీకి చెందిన మావోయిస్టు పోలెపాక సునీల్‌ జనజీవన స్రవంతిలో కలువాలని మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్‌ జే రవికిరణ్‌ అన్నారు. లేబర్‌కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న సునీల్‌ తల్లి సులోచను మంగళవారం ఆయన పరామర్శించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 8న సునీల్‌ తండ్రి జయానందం మృతి చెందినా రాలేదన్నారు. జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల సమస్యలను పరిష్కరించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎస్సై సతీశ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.