పల్లి పదింతలు..

- ఈసారి పది రెట్లు పెరుగనున్న సాగు విస్తీర్ణం
- అదే స్థాయిలో శనగ పంట
- ఉమ్మడి జిల్లాలో రెండు పంటలకూ ప్రాధాన్యం
- యాసంగి వరి తర్వాత రెండో పంటగా పల్లి
- రాష్ట్రంలో మూడోస్థానంలో రూరల్ జిల్లా
- గ్రామం వారీగా పంటల ప్రణాళిక తయారు
- రైతులకు అవగాహన కల్పించడంపై అధికారుల దృష్టి
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పల్లి సాగు పదింతలు కానున్నది. యాసంగి సీజన్ కోసం జిల్లాలవారీగా పంటల ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ క్రమంలో నియంత్రిత సాగు విధానంలో భాగంగా పల్లి, శనగపంట సాగు విస్తీర్ణం గతేడాది కన్నా పెరుగనున్నది. వరి తర్వాత ఈ రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా వేరుశనగ పంట సాగులో వరంగల్ రూరల్ జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలువ నుండడం విశేషం. త్వరలో గ్రామం వారీగా సాగు ప్రణాళిక తయారు కానున్నది. ఇప్పటికే ఎక్కడికకడ రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన కల్పిస్తున్నది.
వరంగల్ రూరల్, నమస్తే తెలంగాణ : నియంత్రిత పంటల సాగు విధానంలో భాగంగా ప్రస్తుత యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం జిల్లాల వారీగా పంటల సాగు ప్రణాళికను తయారు చేసింది. ఆయా జిల్లా ల భౌగోళిక పరిస్థితులకనుగుణంగా వరి, ప ల్లి, శనగ పంటల సాగుకు ప్రాధాన్యమిచ్చిం ది. దీంతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో పల్లి, శనగ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగనుంది. ప్రాజెక్టులు, చెరువులు, బావు లు, బోర్లలో పుష్కలంగా నీరుండడంతో యాసంగి సీజన్లో ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో 7,54,342 ఎకరాల్లో వరి పంట సాగు కానుంది. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 1,92,392 ఎకరాలు, జనగామలో 1,69,920, వరంగల్ రూరల్ జి ల్లాలో 1,43,090, అర్బన్ జిల్లాలో 1,01,929, భూపాలపల్లిలో 90,670, ములుగు జిల్లాలో 56,341 ఎకరాల్లో రైతు లు వరి పంట సాగు చేయనున్నారు. ఈ వానకాలం సీజన్లో ఉమ్మడి జిల్లాలో 7,63,361 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, దీనికి తీసిపోని విధంగా ప్రభుత్వం ఈ యాసంగికి 7,54,342 ఎకరాల్లో వరి పంట సాగు ప్రణాళికను ఖరారు చేసింది.
గణనీయంగా పెరుగనున్న పల్లి..
నియంత్రిత పంటల సాగు విధానంలో భాగంగా యాసంగి సీజన్లో కూడా మొక్కజొన్న పంట సాగు చేయవద్దని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో మొక్కజొన్నకు బదులు పల్లి, శనగ పంటల సాగుకు ప్రాధాన్యమిచ్చింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 83,514 ఎకరాల్లో రైతులు పల్లి పంట సాగు చేయనున్నారు. అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లాలో 35వేల ఎకరాలు, అర్బన్ లో 19,972, మహబూబాబాద్‌లో 18,670, జనగామలో 7,445, ములుగు లో 1,971, భూపాలపల్లి జిల్లాలో 456 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పల్లి పంట సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామం వారీగా సాగు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పల్లి పంట సాగులో రూరల్ జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలువనుండడం విశేషం. వానకాలం సీజన్లోనూ జిల్లాలో మిరప పంటకు ముందు సుమారు 7వేల ఎకరాల్లో పల్లి పంట సాగు చేశారు. గత యాసంగి సీజన్‌ను పరిశీలిస్తే ప్రస్తుత సీజన్లో సాగు చేసే పల్లి పంట రికార్డు స్థాయిలో ఉండనుంది. గతేడాది రూరల్ జిల్లాలో 3625 ఎకరాల్లో, అర్బన్‌లో 1790 ఎకరాల్లో పల్లి వేశారు. ఈ సీజన్లో రూరల్‌లో 35వేలు, అర్బన్ జిల్లాలో 19,972 ఎకరాల్లో సాగు కానుండగా మిగతా జిల్లాలోనూ ఇలాగే పెరుగనుంది.
శనగ పంట కూడా అంతే..
యాసంగి పంటల సాగు ప్రణాళిక మేర కు ఉమ్మడి జిల్లాలో 30,612 ఎకరాల విస్తీర్ణంలో శనగ పంట సాగు కానుంది. అత్యధికంగారూరల్ జిల్లాలో 20,070 ఎకరాలు, అర్బన్‌లో 5,229, మహబూబాబాద్‌లో 2,761, జనగామలో 1,774, భూపాలపల్లి జిల్లాలో 778 ఎకరాల్లో రైతులు శనగ పంట సాగు చేయనున్నారు. గతేడాది రూరల్ జిల్లాలో 2220 ఎకరాల్లో, అర్బన్‌లో 573 ఎకరాల్లో పల్లి పంట వేయగా, ఇప్పుడు రూరల్‌లో 20070 , అర్బన్‌లో 5,229 ఎకరాల్లో సాగు కానుంది. గ్రామం వారీగా తయారు చేస్తున్న యాసంగి పంటల సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ అధికారులు మండల, జిల్లాస్థాయిలో రైతుబంధు సమితి ప్రతినిధులతో సమావేశమై చర్చిస్తారు. చివరకు జిల్లా కలెక్టర్ల ఆమోదంతో గ్రామం వారీ ప్రణాళికను ప్రకటిస్తారు.
సాగులో మార్పు రావాలి..
పంటల సాగులో మార్పు రావాలి. రైతులు డిమాండ్ ఉన్న పంటలే సాగు చేస్తే మంచిది. ఆశించిన ధర పొందవచ్చు. అందు కే ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. మార్కెట్లో ధర లేనందున యాసంగిలో కూడా మక్కజొన్న వేయవద్దని రైతులకు చెబుతున్నది. వీటికి బదులు పల్లి, శనగ పంటలు సాగు చేయాలి. నేడో రేపో గ్రామం వారీగా ప్రణాళిక ఖరారు కానుం ది. ఆ తర్వాత గ్రామం, క్లస్టర్, మండలం, జిల్లావారీగా రైతులకు అవగాహన కల్పిస్తాం. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు యాసంగి పల్లి, శనగ పంటలు సాగు చేయాలని చెబుతున్నారు.
- ఉషాదయాళ్, రూరల్, అర్బన్ జిల్లా వ్యవసాయాధికారి
తాజావార్తలు
- అయ్య రిటైర్మెంట్.. బిడ్డ ఎంగేజ్మెంట్..!
- అన్నదాతకు కన్నీరు రాకుండా చూస్తున్న సీఎం కేసీఆర్
- బైడెన్ ఫస్ట్ డే.. డబ్ల్యూహెచ్‌వోలో చేరనున్న అమెరికా
- మాస్క్ ధరించని విదేశీయులతో పుష్ అప్స్
- ‘మాస్టర్’ వీడియో లీక్..నిర్మాత లీగల్ నోటీసులు
- కమలా హ్యారిస్.. కొన్ని ఆసక్తికర విషయాలు
- రోడ్డు ఊడ్చిన మహిళా కానిస్టేబుల్.. వీడియో వైరల్
- సారీ చెప్పిన సల్మాన్..ఎగ్జిబిటర్లకు గుడ్‌న్యూస్
- ఆస్వాదించు..ఆనందించు
- ఏసీబీ వలలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్‌రెడ్డి