ఆదివారం 29 నవంబర్ 2020
Warangal-rural - Nov 08, 2020 , 02:09:02

రైతు సంక్షేమమే లక్ష్యం : ఎమ్మెల్యే రాజయ్య

రైతు సంక్షేమమే లక్ష్యం  : ఎమ్మెల్యే రాజయ్య

ధర్మసాగర్‌ : రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. ధర్మసాగర్‌, ఎలుకుర్తి గ్రామాల్లో గ్రామైక్య మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతును రాజు చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరుగకుండా మహిళలు, సంబంధిత అధికారులు రైతులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మ కవిత, వైస్‌ ఎంపీపీ బండారు రవీందర్‌, జిల్లా కోఆప్షన్‌ సభ్యురాలు జుబేదాలాల్‌మహ్మద్‌, సర్పంచ్‌ శరత్‌ చంద్రప్రసాద్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ యాద కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సోంపల్లి కరుణాకర్‌, ఎంపీటీసీలు బొడ్డు శోభ, రొండి రాజు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కర్ర సోమిరెడ్డి, ఎంపీడీవో జవహర్‌రెడ్డి, ఏవో పద్మ, ఏఈవో రజిని, డీపీఎం ప్రకాశ్‌, ఏపీఎం అనిత తదితరులు పాల్గొన్నారు .