ఆదివారం 29 నవంబర్ 2020
Warangal-rural - Nov 07, 2020 , 02:33:05

పేద విద్యార్థులకు మొబైళ్ల పంపిణీ

పేద విద్యార్థులకు మొబైళ్ల పంపిణీ

వర్ధన్నపేట: పేద విద్యార్థులకు బాలవికాస ఆధ్వర్యంలో శుక్రవారం మండలకేంద్రంలోని బాలవికాస ప్రధాన కార్యాలయంలో మొబైళ్లను పంపిణీ చేశారు. బాలవికాస ప్రోగ్రాం మేనేజర్‌ లత, ఐటీ ప్రోగ్రాం అధికారి శివరామ్‌ హాజరై వర్ధన్నపేట ప్రాజెక్టు పరిధిలోని మండలాలకు చెందిన 700 మంది విద్యార్థులకు సగం ధరకే ఫోన్లు అందజేశారు. స్మార్ట్‌ఫోన్‌ లేని పేద విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు మొబైళ్లు అందించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో బాలవికాస ప్రతినిధులు జ్యోతి, పీ రాణి, రమ పాల్గొన్నారు.