‘ధరణి’ని సద్వినియోగం చేసుకోవాలి

చెన్నారావుపేట, నవంబర్ 5 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో పవన్‌కుమార్ సూచించారు. మండలంలోని తహసీల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. మండలంలో ప్రతి రోజూ ఎంత మందికి భూములు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని స్థానిక తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకున్న గంట వ్యవధిలోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ జరిగేలా ప్రభుత్వం ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు, భూముల కొనుగోలు దారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ధరణిలో స్లాట్‌బుక్ చేసుకున్న వారికి భూముల రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ పూల్‌సింగ్ చౌహాన్, డిప్యూటీ తహసీల్దార్ మధుసూదన్, గిర్దావర్ స్వామి, ధరణి ఆపరేటర్లు సుధీర్‌కుమార్, సామ్రాట్ పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్ : డివిజన్లోని అన్ని గ్రామాల రైతు లు, ప్రజలు ధరణి రిజిస్ట్రేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో పవన్‌కుమార్ సూచించారు. నర్సంపేట పట్టణంలోని స్థానిక తహసీల్ కార్యాలయం లో ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియ 4వ రోజు కొనసాగింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కార్యక్రమాన్ని ఆర్డీవో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసుకున్న రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాన్ని ఆయన అందజేశారు. తహసీల్దార్ రాంమూ ర్తి, ఆర్ఐ రాజ్‌కుమార్, డీటీ ఉమారాణి ఉన్నారు.
దుగ్గొండి: ధరణి పోర్టల్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి సూచించా రు. గురువారం మండలంలోని తహసీల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మరోసారి కల్పించిన సాదాభైనామా అవకాశాన్ని ఉపయోగించుకొని రైతులు దగ్గరలోని మీసేవ కేంద్రాల్లో ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీటీ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- చరిత్రలో ఈరోజు.. అమెరికా పౌరుల బందీ.. 1 ఏడాది 2 నెలల 2 వారాల 2 రోజులు..
- కిసాన్ ర్యాలీ భగ్నానికి ఉగ్ర కుట్ర
- 'సర్కారు వారి పాట' ఖాతాలో సరికొత్త రికార్డ్
- రాజ్యాంగం అసలు కాపీని ఆ బాక్స్‌లో ఎందుకు ఉంచారో తెలుసా?
- ఎగిరే బల్లి..పొలంలో అలజడి
- ట్రంప్ కొత్త పార్టీ పెట్టడం లేదు..
- ఈ 'కుక్క' మాకూ కావాలి
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా