శనివారం 05 డిసెంబర్ 2020
Warangal-rural - Nov 06, 2020 , 01:58:30

11న దేవాదాయ శాఖ కార్యాలయానికి భూమిపూజ

11న దేవాదాయ శాఖ కార్యాలయానికి భూమిపూజ

వరంగల్‌ చౌరస్తా: ఈ నెల 11న దేవాదాయ శాఖ కార్యాలయ భవన సముదాయానికి భూమి పూజ నిర్వహించనున్న నేపథ్యంలో సెంట్రల్‌ జైల్‌ స్థలాన్ని డిప్యూటీ కమిషనర్‌ వీ విజయరామారా వు, జిల్లా సహాయ కమిషనర్‌ రాముల సునీత, తెలంగాణ అర్చక ఉద్యోగుల ఐక్య కార్యాచరణ స మితి రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్ర శర్మ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ సభ్యుడు బండా రి శేషగిరిరావు పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్‌ విజయరామారావు మాట్లాడు తూ దేవాదాయ శాఖ కమిషనర్‌ ప్రత్యేక శ్రద్ధతో సుమారు రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో కా ర్యాలయ భవన సముదాయాన్ని ఏడాదిలో నిర్మించనున్నామని అన్నారు. ఇందులో జిల్లా స హాయ కమిషనర్‌, 5వ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌, మేడారం సమ్మక్క, సారలమ్మ, ఇంజినీరింగ్‌ విభా గం, వ్యాపార సముదాయం ఏర్పాటు చేయనున్న ట్లు తెలిపారు. ఈ భవన నిర్మాణానికి నవంబర్‌ 11వ తేదీన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌ రావు, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, అరూరి రమేశ్‌, తదితర చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించనున్నామని తెలిపారు.