శనివారం 28 నవంబర్ 2020
Warangal-rural - Nov 04, 2020 , 01:44:45

కేసీఆర్‌ కృషితోనే పండుగలా సాగు

కేసీఆర్‌ కృషితోనే పండుగలా సాగు

  • అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
  • బీజేపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి
  • పట్టభద్రులను ఓటరుగా నమోదు చేయించాలి
  • ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • కేంద్ర సాయం సముద్రంలో కాకిరెట్టతో సమానం
  • రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి
  • పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్‌ 

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితోనే వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లో వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహాక సమావేశాలను మంగళవారం నిర్వహించగా మంత్రి సత్యవతి రాథోడ్‌, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, ఆ పార్టీ కుటిల నీతిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. 

జయశంకర్‌ భూపాలపల్లి, నమస్తేతెలంగాణ/ములు గు/మంజూర్‌ నగర్‌, నవంబర్‌3: రైతు బిడ్డగా సీఎం కేసీఆర్‌  తీసుకున్న నిర్ణయాలతో నేడు వ్యవసాయం రాష్ట్రం లో పండుగలా మారిందని పంచాయతీరాజ్‌శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ములుగు, జయ శంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లో మంగళవారం  పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వ హించగా, గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. ములుగు జిల్లా వ్యవసాయానికి పెట్టిందని పేరని, ఇక్కడ ఉన్న పట్టభద్రులంతా రైతుబిడ్డలేనని అన్నారు. గత ప్ర భుత్వాలకు సైతం సాధ్యం కాని పనులు, అభివృద్ధిని నేడు సీఎం కేసీఆర్‌ కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారని పే ర్కొన్నారు.

పోడు భూములు, బిల్ట్‌ ఫ్యాక్టరీ సమస్యను పరిష్కరించేందుకు కేసీఆర్‌ త్వరలో జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కరంటు మోటర్లకు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేసే కుట్రకు తెరలేపిందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బోగస్‌ ప్రచారం చేస్తుందని, ఆ పార్టీ నాయ కులు చేస్తున్న అసత్య ఆరోపణలను తిప్పికొట్టాలని  పి లుపునిచ్చారు. ఒక్క  ప్రాజెక్టుకూ జాతీయ హోదా క ల్పించలేదని మండిపడ్డారు. భూపాలపల్లికి కాళేశ్వరం, దేవాదుల  ద్వారా  ప్రతి ఎకరానికి సాగు నీరు అందిం చాలని సీఎం ఆదేశించారని మంత్రి వెల్లడించారు. మా నుకోట ఎంపీ మాలోత్‌ కవిత మాట్లాడుతూ కార్యకర్తల కృషితోనే గత ఎన్నికలో తన గెలుపు సాధ్యమైందన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిదే విజయమని అన్నారు. వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్మన్‌ గండ్ర జ్యోతి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని అన్నా రు. ములుగు జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ మా ట్లాడుతూ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఎమ్మెల్సీ అ భ్యర్థి గెలుపు కోసం పనిచేయాలన్నారు. 

రాష్ట్ర దివ్యాంగు ల కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మా ట్లాడుతూ ఎన్నికలో గెలుపును సీఎం కేసీఆర్‌కు బహు మతిగా అందిస్తామని అన్నారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్‌ సాంబారి సమ్మారావు, ఓటరు నమోదు ములుగు జిల్లా ఇన్‌చార్జి పోరిక గోవింద్‌నాయ క్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, టీఆర్‌ఎస్‌ భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, మండల అధ్యక్షుడు మందల రవీందర్‌రెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్‌ కల్లెపు శోభారాణి, మున్సిపల్‌ చైర్‌ పర్స న్‌ సెగ్గెం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, రాజే శ్‌నాయక్‌, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఆత్మ చై ర్మన్లు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు, ఓటరు నమోదు ఇన్‌చార్జిలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 

ఎమ్మెల్సీ పల్లా, ఎంపీ కవితకే ములుగు జిల్లా పగ్గాలు 

ములుగు జిల్లాలో గులాబీ దండును కాపాడుకునేం దుకు ఇక నుంచి రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు మానుకోట ఎంపీ కవిత పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారని తెలిపారు. 

పార్టీ కార్యాలయ ప్రారంభానికి సీఎం రాక

ములుగు రూరల్‌: మండలంలోని బండారుపల్లి శివారులో నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యా లయ భవన ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ రా నున్నారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌ తెలిపారు. మంగళవారం వారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి,  మాలోత్‌ కవితతో కలిసి గట్టమ్మ వద్ద మొక్కులు చెల్లించారు. కార్య క్రమంలో జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకు డు కాకులమర్రి లక్ష్మణ్‌రావు, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, జడ్పీటీసీ సకినాల భవాని, టీఆర్‌ఎస్‌ మండ ల అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌, జిల్లా నాయకుడు గం డ్రకోట సుధీర్‌యాదవ్‌, పట్టణ అధ్యక్షుడు మేర్గు సంతోష్‌, తదితరులు ఉన్నారు.  

శ్రద్ధతో ఓటరు నమోదు చేపట్టాలి

శ్రద్ధతో పట్టభద్రుల ఓటరు నమోదును చేపట్టాలి. ములుగు జిల్లా చివరి ఆయకట్టు వరకు నీరు అందించే బాధ్యత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే. ఎన్నికలో ఎవరు గెలి స్తే పనులు జరుగుతాయో కార్యకర్తలు ప్రజలకు వివరిం చాలి. ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించేం దుకు సమష్టిగా కృషి చేయాలి. 

- మంత్రి సత్యవతి రాథోడ్‌

కేంద్ర సాయం కాకి రెట్టతో సమానం 

రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులు సముద్రంలో పడిన కాకి రెట్టతో సమానం. అన్ని వర్గాలకు స్వాంతన చేకూర్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్ట భద్రులకు సైతం అవకాశాల మేరకు ఉద్యోగాలను కల్పి స్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే లక్షా 50వేల కంటే ఎ క్కువగానే ఉద్యోగాలు ఇచ్చింది. 

- రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి