బుధవారం 02 డిసెంబర్ 2020
Warangal-rural - Nov 04, 2020 , 01:24:43

నాలుగుకు తగ్గిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు

నాలుగుకు తగ్గిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు

శాయంపేట: మండల పరిధిలో వానకాలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య నాలుగుకు తగ్గింది. గత సీజన్‌లో ఏడుచోట్ల కేంద్రాలు ఉండగా, నిర్వాహకుల తీరుతో మూడు సెంటర్లను రద్దు చేసినట్లు ఐకేపీ ఏపీఎం శ్రీధర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. శాయంపేట, పెద్దకోడెపాక, కొప్పుల-1, పత్తిపాకలో కొనుగోలు కేంద్రాలు మంజూరైనట్లు చెప్పారు. ప్రగతిసింగారం, కాట్రపల్లి, కొప్పుల-2 సెంటర్లు రైద్దెనట్లు తెలిపారు. ప్రగతిసింగారంలో నిర్వాహకులు అక్రమాలకు పాల్పడినట్లు డీపీఎం విచారణలో తేలింది. దీంతో సెంటర్‌ను రద్దు చేసినట్లు చెప్పారు. కాట్రపల్లి, కొప్పుల-2 సెంటర్ల నిర్వాహకులు యాసంగి సీజన్‌లో గన్నీ సంచుల లెక్క చెప్పలేదు. మిగిలిన సంచులను అప్పగించలేదు. దీనివల్ల అధికారులు కేంద్రాలను రద్దు చేసినట్లు వెల్లడించారు.