మంగళవారం 01 డిసెంబర్ 2020
Warangal-rural - Nov 03, 2020 , 02:12:40

విద్యార్థులకు చేయూత..

విద్యార్థులకు చేయూత..

ఐనవోలు: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం, ‘మన బడి-మన బాధ్యత’ ద్వారా నియోజకవర్గంలోని పేద విద్యార్థులకు చేయూత అందించేందుకు తన తండ్రి పేరుమీద ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి నిత్యం పేద విద్యార్థులకు తోడ్పటు అందిస్తున్నాడు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌..  తనకు ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అభిమానంతో ‘నేడు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఐఐఐటీ బాసరకు అర్హత సాధించిన విద్యార్థులకు ఒంటిమామిడిపల్లి పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అడ్మిషన్‌ ఫీజ్‌, ఇతర ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థికి రూ.5వేల చొప్పున అందజేయనున్నారు. 

అభినందన సభకు ప్రముఖులు..

అభినందన సభకు డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, నియోజకవర్గంలోని బాసరకు అర్హత సాధించిన 25 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల డీఈవోలు, 8 మండలాల ఎంఈవోలు, వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హాజరుకానున్నారు.