గురువారం 03 డిసెంబర్ 2020
Warangal-rural - Nov 03, 2020 , 02:13:02

అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

అలంపూర్‌: అలంపూర్‌ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయాలని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మనోరమ వెంకటేశ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌  సత్యనారాయణను కోరారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సమస్య, మున్సిపాలిటీలో సిబ్బంది కొరత, అంతర్గత రోడ్ల నిర్మాణాలు తదితర సమస్యలున్నాయి.ఈ సందర్భంగా డైరెక్టర్‌ సత్యనారాయణ ప్లాస్టిక్‌ నిర్మూలనకు కృషి చేయాలని సూచించి నట్టు ఆమె పేర్కొన్నారు.వారితోపాటు ఉప సంచాలకులు ఫాల్గున్‌ కుమార్‌పాటు ఆర్డీవో సూపరింటెండెంట్‌ చాముండేశ్వరి, మంజుల, వెంకటేశ్‌ తదితరులు ఉన్నారు.

అడిషనల్‌ డీజీపీని కలిసిన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ 

అలంపూర్‌ వాసి సుప్రీం స్వేరో, అడిషనల్‌ డీజీపీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వెనుకబడిన ప్రాంతమైన అలంపూర్‌ అభివృద్ధి కోసం పలు అంశాలపై చర్చించారు. యువతను విద్యాపరంగా ముందుకు తీసుకు రావడానికి కృషి చేయాలని కోరారు.