గురువారం 03 డిసెంబర్ 2020
Warangal-rural - Nov 01, 2020 , 01:55:41

సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి

సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి

టీఆర్‌ఎస్‌ వార్డు కమిటీల బాధ్యులకు పట్టణ సమన్వయ కమిటీ సభ్యుల సూచన

పరకాల టౌన్‌: నూతనంగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ వార్డు కమిటీ బాధ్యులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని పట్టణ సమన్వయ కమిటీ సభ్యుడు సోదా రామకృష్ణ అన్నారు. సోమవారం మున్సిపల్‌ పరిధిలోని 14, 17వ వార్డులో టీఆర్‌ఎస్‌ కమిటీలను ఎన్నుకున్నారు. 14వ వార్డు అధ్యక్షుడిగా వెంకటేశ్‌, ప్రధాన కార్యదర్శిగా కొక్కిరాల సంపత్‌రావు, కోశాధికారిగా దగ్గు నర్సింగరావు, యూత్‌ అధ్యక్ష కార్యదర్శులుగా తోట నూతన్‌కుమార్‌, ఎండీ అబ్రార్‌, మహిళా అధ్యక్షురాలుగా కొక్కిరాల శైలజ, 17 వార్డు అధ్యక్షుడిగా చట్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా రాయబారపు అనిల్‌, కోశాధికారిగా తోట రవీందర్‌, సలహాదారులుగా చందుపట్ల సాంబశివరెడ్డి, బండి ఆగయ్య, ఆవుల కొమురయ్య, ఎండీ బాషిమియా, చెన్న మల్లేశం, సూర సంజీవయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు చందుపట్ల రమణారెడ్డి, బండి సారంగపాణి, రేగూరి విజయపాల్‌రెడ్డి, పావుశెట్టి వెంకటేశ్వర్లు, దగ్గు విజేందర్‌రావు, నిప్పాని సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ బొచ్చు వినయ్‌, కౌన్సిలర్లు మార్క ఉమాదేవి-రఘుపతి, పాలకుర్తి గోపి, టీఆర్‌ఎస్‌ నాయకుడు పాడి భగవాన్‌రెడ్డి పాల్గొన్నారు.