మంగళవారం 24 నవంబర్ 2020
Warangal-rural - Oct 31, 2020 , 02:28:47

ప్రకృతి వనరుల సంరక్షణకు పాటుపడాలి

ప్రకృతి వనరుల సంరక్షణకు పాటుపడాలి

రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ శోభ

ములుగు/వెంకటాపూర్‌: రాష్ట్రంలో కేన్‌ అటవీ ప్రాంతంగా ఉన్న ఏకైక ప్రాంతం వెంకటాపూర్‌ మండలం పాలంపేట అని, ఆ మొక్కలు సంరక్షణకు అటవీ శాఖ అధి కారులు పాటుపడాలని రాష్ట్ర ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌(పీసీసీఎఫ్‌) రొ య్యూరు శోభ అన్నారు. శుక్రవారం పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌ సాదరంగా ఆహ్వానించారు. రామలింగేశ్వరస్వామికి పూజలు చేశారు. అక్కడి శిల్ప కళా సంపద విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కేన్‌ మొక్కలను పరిశీ లించారు. అధికారులకు సూచనలు చేశారు. అక్కడి నుంచి ఆమె ములుగు జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో డీఎఫ్‌వో భవన నిర్మాణ పనులకు శంకు స్థాపన చేశారు. అనంతరం మరమ్మతులు  చేసిన ఎఫ్‌డీవో చాంబర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న కేన్‌ మొక్కల జాతిని అంతర్జాతీయ ప్రకృతి సహజ వనరుల సంస్థ ఇన్‌త్రెటనెడ్‌ క్యాటగిరీ మొక్కల విభాగంలో చేర్చినట్లు తెలిపారు. వీటిని సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని అన్నారు.  కేన్‌ మొక్కలు ఉన్న ప్రాంతం జీవ వైవిధ్యానికి నిలయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆమె వెంట వరంగల్‌ సీసీఎఫ్‌ ఎంజే అక్బ ర్‌, డీఎఫ్‌వో ప్రదీప్‌కుమార్‌శెట్టి, ములుగు ఏఎస్పీ సాయిచైతన్య, ఎఫ్‌డీవో నిఖిత, ట్రెయినీ ఐఎఫ్‌ఎస్‌ రాహుల్‌, మంచిర్యాల డీఎఫ్‌వో శివాని, ఎఫ్‌డీవోలు గోపాల్‌రా వు, వీణావాణి, లావణ్య, ఎఫ్‌ఆర్వోలు రామ్మోహన్‌, గౌతమ్‌రెడ్డి, మహారాష్ట్ర, ఛత్తీస్‌ గఢ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ శిక్షణాధికారులు, ఫారెస్టు సిబ్బంది ఉన్నారు.