బుధవారం 02 డిసెంబర్ 2020
Warangal-rural - Oct 28, 2020 , 02:25:53

రక్తదానం చేసిన రాయపర్తి యువత

రక్తదానం చేసిన రాయపర్తి యువత

రాయపర్తి: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా డివిజన్‌ పోలీస్‌ శాఖ నేతృత్వంలో మంగళవారం రెడ్‌క్రాస్‌ స్వచ్ఛంద సంస్థ సహకారంతో వర్ధన్నపేటలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మండలంలోని యువకులు రక్తదానం చేశారు. ఎస్సై గోదరి రాజ్‌కుమార్‌ నేతృత్వంలో మండలంలోని 39 గ్రామాల్లో పర్యటిస్తూ యువతలో చైనత్యం నింపారు. దీంతో యువకులు రక్తదాన శిబిరానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. మండలంలోని కొండాపురం, సన్నూరు, ఆరెగూడెం, రాయపర్తి, పెర్కవేడు, కొత్తూరుకు చెందిన యువకులు సర్పంచ్‌లు కోదాటి దయాకర్‌రావు, నలమాలస సారయ్య, పెండ్లి రజినీ సుధాకర్‌రెడ్డి, గారె నర్సయ్య, చిన్నాల తారాశ్రీ రాజబాబు, కందికట్ల స్వామి సహకారంతో శిబిరానికి తరలివచ్చి రక్తదానం చేశారు.