శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Oct 27, 2020 , 01:28:22

అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పాల్గొన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

చిలుపూర్‌, అక్టోబర్‌ 26: అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని మల్కాపూర్‌లో ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు. ఆగ్రోస్‌ సేవా కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తులను రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులను రాజేశ్వర్‌రెడ్డి కోరారు. ఎలాంటి లాభాపేక్షనతో కాకుండా సేవా ధృక్పథంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎడవెల్లి కృష్ణారెడ్డి, ఎంపీపీ బొమ్మిశెట్టి సరితా బాలరాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గుర్రపు వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ రవి, ఎంపీటీసీ సుధాకర్‌, నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ రంగు రమేశ్‌, వంశీ, కేశిరెడ్డి రాకేశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


logo