శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-rural - Oct 25, 2020 , 02:15:10

బతుకమ్మతల్లి విగ్రహాల ఆవిష్కరణ

బతుకమ్మతల్లి విగ్రహాల ఆవిష్కరణ


పర్వతగిరి : మండలంలోని బూరుగుమళ్ల, చౌటుపెల్లి గ్రామాల్లో బతుకమ్మ తల్లి విగ్రహాలను ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ శనివారం ఆవిష్కరించారు. బూరుగుమళ్లలో మార్కెట్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ జితేందర్‌రెడ్డి, సర్పంచ్‌ ఇందిరతో కలిసి ఎమ్మెల్యే రమేశ్‌ బతుకమ్మను ఎత్తుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లూనావత్‌ కమల పంతులు, జడ్పీటీసీ సింగ్‌లాల్‌, మార్కెట్‌ డైరెక్టర్లు శాంతిరతన్‌రావు, ఏకాంతంగౌడ్‌,  సర్పంచ్‌ గౌరారపు ఉమ, వైస్‌ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, ఎంపీటీసీ లావణ్య ప్రవీణ్‌రావు, యుగేంధర్‌రావు, సర్వర్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు మనోజ్‌కుమార్‌, గొర్రె దేవేందర్‌, నాయకులు రంగు కుమార్‌గౌడ్‌, వంగాల శాంతికృష్ణ, జనార్దన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రామలింగం, మధుకర్‌రెడ్డి, పెద్ద మాధవరావు, గోపాల్‌రావు పాల్గొన్నారు.  

కరోనా మహమ్మారిని జయించాలి :  అరూరి

వర్ధన్నపేట, అక్టోబర్‌ 24 : రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ధన్వంతరి స్మైల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అందిచే మందును వాడాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. పార్టీ శ్రేణులకు క్యాంపు కార్యాలయంలో ఇమ్యూనిటీ బూస్టర్‌ను అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తూల్ల కుమారస్వామి, నాయకులు చొప్పరి సోమయ్య పాల్గొన్నారు.