శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-rural - Oct 25, 2020 , 02:15:10

రైతుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్‌

రైతుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్‌

ఖానాపురం, అక్టోబర్‌ 23: రైతుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్‌ అని ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోత్‌ రామస్వామినాయక్‌ అన్నారు. స్థానిక సొసైటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన మక్కలను రూ.1850కి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్‌ ప్రకటించడం హర్షనీయమన్నారు. గతేడాది ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 137 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్కలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. బీఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తి చేసిన విద్యార్థులకు కొనుగోలు కేంద్రాలను మంజూరు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, నర్సంపేట మాజీ మార్కెట్‌ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

రైతు వేదికల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోత్‌ రామస్వామినాయక్‌ అన్నారు. ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావుతో కలిసి మండలంలోని అశోక్‌నగర్‌, బుధరావుపేట,ధర్మరావుపేట, ఖానాపురం గ్రామాల్లోని రైతు వేదికలను, ధర్మరావుపేట, బుధరావుపేటలో కూల్చివేసిన సొసైటీ భవన స్థలాలను పరిశీలించారు.