పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి

మిల్స్‌కాలనీ, అక్టోబర్ 22 : పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్‌లోని ఐదో డివిజన్ రామకృష్ణాపురంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో మామునూరు సబ్ డివిజన్ ఆధ్వర్యంలో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రమేశ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పండుగల సమయం లో కూడా విధి నిర్వహణలో భాగంగా కుటుంబాలకు దూరంగా ఉండే పోలీసుల త్యాగాలు మరువలేనివన్నా రు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో తెలంగాణ పోలీసులు దేశంలోనే ఉత్తమ పోలీసులుగా గుర్తింపు పొందారన్నా రు. అనంతరం యువత నుంచి 360 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. దాతలకు ఎమ్మెల్యే రక్తదాన పత్రాలను అందజేశారు. యువతతో పాటు మామునూరు, పర్వతగిరి సీఐలు సార్ల రాజు, పీ కిషన్, ఎస్సైలు రక్తదానం చేశారు. రక్తదాతలను ఎమ్మెల్యే రమేశ్, ఏసీపీ శ్యాంసుందర్ అభినందించారు. అలాగే మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించి, రెండు నిముషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ రూరల్ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకన్న, ఐదో, ఆరు డివిజన్ల కార్పొరేటర్లు పసునూరి స్వర్ణలత, చింతల యాదగిరి, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఉస్మాన్అలీ, గీసుగొండ సీఐ శివరామయ్య, వనంరెడ్డి, శాంతికుమార్, టీఆర్ఎస్ ఆరో డివిజన్ అధ్యక్షుడు నోముల వెంకట్‌రెడ్డి, ఖిలావరంగల్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ సోల్తి భూమాత, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- గ్లోబల్ ఐటీ దిగ్గజంగా టీసీఎస్!
- ఢిల్లీ గణతంత్ర వేడుకలకు గిరిజన మహిళ..!
- టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లపై పర్మినెంట్ బ్యాన్!
- కూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి
- కల్నల్ సంతోష్‌కు మహావీర చక్ర
- మేక పిల్లను రక్షించబోయి యువకుడు మృతి
- తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం
- మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు
- రాజస్థాన్‌లో పెట్రోల్ భగభగ.. లీటర్ @ రూ.100
- పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం