శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-rural - Oct 22, 2020 , 01:35:07

ప్రైవేట్‌ టీచర్లకు బియ్యం పంపిణీ

ప్రైవేట్‌ టీచర్లకు బియ్యం పంపిణీ

చెన్నారావుపేట: సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్‌ కంది విజయాగోపాల్‌రెడ్డి బుధవారం మండలకేంద్రంలోని గురుకుల పాఠశాలలో 67 మంది ప్రైవేట్‌ టీచర్లు, సిబ్బందికి ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున 17 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ అండెం కరుణాకర్‌రెడ్డి, కృష్ణమోహన్‌, హరిప్రసాద్‌, చారి, బొనగాల రమేశ్‌, జగదీశ్‌, వేణు, లావణ్య, రాజు, శ్రీధర్‌, కిరణ్‌, కిషన్‌, రాధిక, సునీత, శైలజ, పద్మ, రమాదేవి, రోజా, జ్యోతి, సృజన పాల్గొన్నారు. అలాగే, ముగ్ధుంపురం రైతు ఉత్పత్తి సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి మాధవరావు రూ. 10 వేలను అమీనాబాద్‌కు చెందిన పొదుపు సంఘం వ్యవస్థాపకుడు కొంపల్లి నర్సింహరాములు కుటుంబానికి అందజేశారు. ఆయన వెంట సొసైటీ డైరెక్టర్‌ సాంబారెడ్డి, జైపాల్‌రెడ్డి, మల్లారెడ్డి, ఆదిరెడ్డి, సాంబయ్య ఉన్నారు. అలాగే,  మండలకేంద్రానికి చెందిన సాదు ఉప్పలమ్మ(85) మృతి చెందగా, ఆమె కుమారులు కట్టారెడ్డి, వీరారెడ్డి, కేశవరెడ్డి, కుమార్తె స్వరూపను టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్న, చెన్నారావుపేట సొసైటీ చైర్మన్‌ ముద్దసాని సత్యనారాయణరెడ్డి పరామర్శించారు. వారి వెంట అమీనాబాద్‌ సొసైటీ చైర్మన్‌ మురహరి రవి, వైస్‌ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ బుర్రి తిరుపతి, సర్పంచ్‌లు కుండె మల్లయ్య, కుమారస్వామి, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, మాజీ ఎంపీపీ వీరారెడ్డి, మహేందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రఫీ, నరేందర్‌, సొసైటీ డైరెక్టర్లు బాబు, రాంబాబు, రాంచంద్రు ఉన్నారు.

మల్టీపర్పస్‌ వర్కర్‌ కుటుంబానికి చేయూత

శాయంపేట: తహార్‌పూర్‌ పరిధిలో పని చేస్తున్న మల్టీపర్పస్‌ వర్కర్‌ కొమ్ముల సుధాకర్‌ పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అతడిది నిరుపేద కుటుంబం కావడంతో అధికారులు, కార్యదర్శులు ఆర్థిక సాయం అందించారు. ఎంపీడీవో ఆమంచ కృష్ణమూర్తి, ఎంపీవో రంజిత్‌కుమార్‌, కార్యదర్శుల సంఘం నాయకుడు రాయకంటి రాజు మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రూ. 12,500 ఆర్థిక సాయంగా అందజేశారు.