కృష్ణసాయి, మౌర్యాని జంటగా నటిస్తున్న చిత్రం ‘సుందరాంగుడు’. బీసు చందర్‌గౌడ్, ఎంఎస్కె రాజు నిర్మాతలు. ఎం. వినయ్‌బాబు దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను తెలంగాణ రాష్ట్ర డీఐజీ సుమతి విడుదలచేశారు. కృష్ణసాయి మాట్లాడుతూ ‘మనిషికి మనసే నిజమైన అందం అనే పాయింట్‌తో సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నాం. స్వచ్ఛమైన ప్రేమ గొప్పతనాన్ని డబ్బున్న ఓ యువకుడు ఎలా తెలుసుకున్నాడన్నది ఆకట్టుకుంటుంది. చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుతున్నాం’ అని తెలిపారు.