శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - Oct 17, 2020 , 01:52:04

ఎంగిలిపూల సందడి..

ఎంగిలిపూల సందడి..

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: పూలను దేవతగా భావించి పూజించే తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ పండుగ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయాన్నే తీరొక్క పూలు సేకరించి అందమైన బతుకమ్మలు పేర్చారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి.. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో ఆడబిడ్డలు తగిన జాగ్రత్తలతో ఆటపాటలతో అలరించారు.

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళలు ఆడిపాడారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. నర్సంపేట పట్టణంలో జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ పెద్ది స్వప్న, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజిని, పర్వతగిరిలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్‌పర్సన్‌ ఉష పాల్గొన్నారు. అలాగే, వర్ధన్నపేట, ఖానాపురం, దుగ్గొండి, రాయపర్తి, గీసుగొండ, సంగెం, పరకాల, ఆత్మకూరు, శాయంపేట, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎప్పుడూ ప్రజాసేవలో బిజీగా ఉంటే మహిళా ప్రజాప్రతినిధులు సైతం అందమైన బతుకమ్మలు పేర్చి స్థానిక మహిళలతో కలిసి ఆడిపాడారు.


logo