మంగళవారం 24 నవంబర్ 2020
Warangal-rural - Oct 16, 2020 , 06:42:39

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

భీమారం: భీమారం బొడ్రాయి వద్ద గడ్డం రా ధాకిషన్‌ రేషన్‌ షాపు నంబర్‌ 22 డీలర్‌ ఇంటిలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్‌ బియ్యాన్ని   టా స్క్‌ఫోర్స్‌, కేయూ పోలీసులు పట్టుకున్నారు.  పక్కా సమాచారంతో  గురువారం దాడి చేసి 114 బ్యాగుల  రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నా రు. పోలీసుల విచారణలో డీలర్‌ రాధాకిషన్‌, ఆ యన కుమారుడు గడ్డం భార్గవ్‌ కొద్ది రోజులుగా రేషన్‌ బియ్యాన్ని కార్డుదారుల నుంచి అక్రమంగా తక్కువ ధరలకు కొనుగోలు చేసి అధిక ధరలకు బ్రోకర్లకు అమ్ముతునట్లు కేయూ ఎస్సై రవీందర్‌ తెలిపారు. పట్టుపడిన బియ్యం 57 క్వింటాళ్లు ఉ న్నాయని, డీలర్‌ రాధాకిషన్‌, గడ్డం భార్గవ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవీందర్‌ తెలిపారు. ఈ తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్‌ సీఐ నందిరామ్‌నాయక్‌, కేయూ ఎస్సై రవీందర్‌, పోలీసులు పాల్గొన్నారు.