గురువారం 26 నవంబర్ 2020
Warangal-rural - Oct 16, 2020 , 06:42:36

క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకుల అరెస్టు

క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకుల అరెస్టు

  • రూ. 37,000 నగదు ఆరు సెల్‌ఫోన్లు సీజ్‌

వరంగల్‌ క్రైం: వరంగల్‌ నగరంలోని హౌసింగ్‌ బోర్డులో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ఆరుగురు వ్యక్తులను గురువారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని సుబేదారి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు ఆరుగురిని సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నందిరాంనాయక్‌ కథనం ప్రకారం.. హౌసింగ్‌ బోర్డులోని కడాయి రెస్టారెంట్‌ సమీపంలో నునావత్‌ తి రుపతి, బానోత్‌ దేవేందర్‌ ఢిల్లీ- రాజస్థాన్‌ మధ్య జరిగే ఐపీఎల్‌ క్రికె ట్‌ మ్యాచ్‌పై బెట్టింగ్‌ పాల్పతుడున్నారనే సమాచారం మేరకు టా స్క్‌ఫోర్స్‌ బృందం అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో తిరుపతి, దే వేందర్‌తోపాటు మరో నలుగురు వ్యక్తులు  లావుడ్య రాజు, మాలోత్‌ విజేందర్‌, దోపతి శ్రీనివాస్‌, రాజు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా మ్యాచ్‌ ప్రారంభం నుంచి బెట్టింగ్‌లు నిర్వహి స్తున్నట్లు ఒప్పుకున్నారు. వెంటనే వారి నుంచి రూ 37,000 నగ దుతోపాటు 6 స్మార్ట్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆరుగురు వ్యక్తులను సుబేదారి పోలీసులకు అప్పగించగా అరెస్టు చేసినట్లు తెలిపారు.