బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Oct 15, 2020 , 03:01:48

నిరాడంబంగా దర్గా ఉత్సవాలు ప్రారంభం

నిరాడంబంగా దర్గా ఉత్సవాలు ప్రారంభం

  • కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి

కాజీపేట, అక్టోబర్‌ 14 : హజరత్‌ సయ్యద్‌ షా అఫ్జల్‌ బియాబానీ దర్గా ఉత్సవాలు బుధవా రం రాత్రి నిరాడంబంగా ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో సందల్‌ వేడుకల మొదటిరో జు కొద్దిమంది భక్తులతో ఊరేగింపు ప్రశాంతంగా సాగింది. దర్గా కాజీపేట, దర్గా జాగీర్‌లోని (బడేఘార్‌)లో బియాబానీ కుటుంబానికి చెందిన మ హిళలు ఉదయం నుంచి రాత్రి వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో గంధం తీసి వెండి గిన్నెలో భద్రపర్చారు. సందల్‌లో కార్యక్రమంలో భాగంగా బడేఘార్‌లో దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా పలువురి తో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం పీఠాధిపతి గంధం వెండి గిన్నెను తలపై పెట్టుకుని దర్గా కు తీసుకెళ్లారు.

దర్గాలోని సమాధికి గంధలేపనం చేసి ఫూల్‌ చాదర్‌ కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉ ర్సు ప్రారంభమైనట్లు ప్రకటించారు. దర్గాలో రా త్రంతా కవ్వాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనల్లో ఉప పీఠాధిపతి భక్తియార్‌ బా బా, కార్పొరేటర్‌ అబూబక్కర్‌, మత గురువులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. కాగా, ఎలాంటి అ వాంఛనీయ  ఘటనలు జరుగకుండా కాజీపేట ఏసీపీ రవీందర్‌కుమార్‌ ఆదేశానుసారం సీఐ రా వుల నరేందర్‌  నేతృత్వంలో ఎస్సైలు అశోక్‌కుమార్‌, రవీందర్‌ బందోబస్తు నిర్వహించారు. logo