బుధవారం 02 డిసెంబర్ 2020
Warangal-rural - Oct 06, 2020 , 04:42:03

రైతు ఉత్పత్తి సంఘాలకు ఉజ్వల భవిష్యత్‌

రైతు ఉత్పత్తి సంఘాలకు ఉజ్వల భవిష్యత్‌

  • మహిళా రైతు ఉత్పత్తి కేంద్రం ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత
  • పాల్గొన్న ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి

 ఖానాపురం: రైతులందరూ సంఘటితమై ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేసుకుంటే వారికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ప్రభుత్వ విప్‌, ఆలే రు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. సోమవా రం మండలంలోని అశోక్‌నగర్‌లో గోదా దేవి మ హిళా రైతు ఉత్పత్తి సంఘాన్ని స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతుల కోసం అనేక పథకాలను ప్ర వేశపెట్టారన్నారు. ఉత్పత్తి సంఘాలతో రైతులు పండించిన పంటను వారే మార్కెట్‌ ధరను నిర్ణ యించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడి రైతుల స్ఫూర్తితో తమ నియోజకవర్గంలో సంఘా లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

పాకాలలో బోటు షికారు

పాకాలలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎ మ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బోటు షికారు చేశారు. ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోత్‌ రామస్వామి, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్‌ మాజీ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, నర్సంపేట,   గిరి, ఆలేరు ఏడీఏలు తోట శ్రీనివాసరావు, దేవ్‌ సింగ్‌, వెంకటేశ్వర్‌రావు, రైతుబంధు మండల క న్వీనర్‌ కుంచారపు వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ గొర్రె కవి త, వైస్‌ ఎంపీపీ రామసాయం ఉమారాణి, ఏవో శ్రీనివాస్‌, బొప్పిడి పూర్ణచందర్‌రావు, ఎంపీటీసీ భట్టు శంకర్‌, గంగాధర రమేశ్‌, దంతాల రాంబాబు, బసవబోయిన రమ, గంట లక్ష్మి పాల్గొన్నారు.