ఆదివారం 06 డిసెంబర్ 2020
Warangal-rural - Oct 05, 2020 , 06:15:49

అంబేద్కర్‌ జీవిత చరిత్ర తెలుసుకోవాలి

అంబేద్కర్‌ జీవిత చరిత్ర తెలుసుకోవాలి

వర్ధన్నపేట: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జీవిత చరిత్రను నేటి యువత  తెలుసుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్‌ సూచించారు. జైభీమ్‌ విద్యా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న పల్లెపల్లెకూ అంబేద్కర్‌ జ్ఞానయాత్ర కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌, కరపత్రాన్ని ఎస్సై వంశీకృష్ణతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. చదువు ప్రాధాన్యాన్ని తెలుసుకొని ఎన్ని ఇబ్బందులెదురైనా అంబేద్కర్‌ ఉన్నత విద్యను అభ్యసించారని గుర్తుచేశారు. నేటి యువత అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ వ్యవస్థాపకడు జన్ను రాజు, యువకులు పాల్గొన్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

జేసీబీ, డోజర్‌ యజమానులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్‌ హెచ్చరించారు. ఈ  సందర్భంగా ఆయన జేసీబీ, డోజర్‌ యజమానులతో పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు సూచనలు చేశారు. సర్కారు భూముల్లోని మొరం, మట్టిని తరలిస్తే డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సమావేశంలో సీఐ విశ్వేశ్వర్‌, ఎస్సైలు వంశీకృష్ణ, రాజ్‌కుమార్‌, కిశోర్‌ పాల్గొన్నారు.