సోమవారం 30 నవంబర్ 2020
Warangal-rural - Oct 05, 2020 , 06:07:06

ఎల్‌ఆర్‌ఎస్‌పై దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి

ఎల్‌ఆర్‌ఎస్‌పై దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి

  •  ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

నర్సంపేట, అక్టోబర్‌ 4 : ఎల్‌ఆర్‌ఎస్‌పై కొందరు చేస్తున్న దుష్ప్రాచారాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు తిప్పికొట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నూతన రెవెన్యూ చట్టంపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు, మండలాల్లోని ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో నంబర్‌ 135 ప్రకారం అనధికార ప్లాట్లు, లే అవుట్లు కలిగిన వారందరూ తప్పకుండా రెగ్యులర్‌ చేసుకోవాలన్నారు. దీర్ఘకాలంగా నెలకొన్న అనేక క్లిష్టమైన సమస్యలకు ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. నర్సంపేటలోని గ్రామ కంఠం భూముల్లో గృహాలు నిర్మించుకున్న వారు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తప్పకుండా ఇవ్వాలన్నారు. ఆన్‌లైన్‌ ప్రక్రియపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. మున్సిపల్‌, గ్రామాల్లో వంద శాతం ఆస్తులు నమోదయ్యేలా చూడాలన్నారు. పేదల భూముల అక్రమణ, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో అవకతవకలు, తప్పుడు డాక్యుమెంట్ల నమోదు, మోసపూరిత కార్యక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. అన్ని హక్కులు, అనుమతులు ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు.