శనివారం 05 డిసెంబర్ 2020
Warangal-rural - Oct 05, 2020 , 06:01:01

శరవేగంగా రైతువేదికలు

శరవేగంగా రైతువేదికలు

  • దసరా పండుగలోగా పూర్తి చేసేందుకు సన్నాహాలు
  • వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో 334 క్లస్టర్లు
  • అన్ని క్లస్టర్లలోనూ రైతు వేదికల నిర్మాణం
  • కొద్ది రోజులుగా నిర్మాణ పనుల్లో స్పీడ్‌
  • పలు క్లస్టర్లలో ఇప్పటికే తుది దశకు చేరిన పనులు
  • క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్లు

అన్నదాతలందరినీ ఒక చోట చేర్చి వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించడం.. కొత్త పథకాలను వివరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 334 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 334 రైతు వేదికలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొన్ని నిర్మాణాలు పూర్తి కాగా, మరికొన్ని తుది దశలో, మిగతావి రూఫ్‌, లెంటల్‌, బేస్మెంట్‌ లెవల్‌లో ఉన్నాయి. నిర్మాణ పనులను కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ స్పీడప్‌ చేస్తున్నారు. దసరాలోగా వేదికలను సిద్ధం చేయాలనే లక్ష్యంతో అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగించేందుకు చర్యలు చేపడుతున్నారు.

 - వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ

వరంగల్‌రూరల్‌-నమస్తేతెలంగాణ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనుల్లో అధికారులు వే గం పెంచారు. దసరా పండుగలోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే వరంగల్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు క్లస్టర్లలో వేదికల నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ప్రారంభానికి సిద్ధం అవుతున్నాయి. వరంగల్‌ ఉమ్మ డి జిల్లాలో మొత్తం 334 వ్యవసాయ క్లస్ట ర్లు ఉన్నాయి. వీటిలో అత్యధిక క్లస్టర్ల పరిధిలో అధికారులు రైతు వేదికల నిర్మాణం కోసం సర్కారు స్థలాలను గుర్తించారు. ప్ర భుత్వ జాగ లేని కొన్ని క్లస్టర్లలో దాతలు భూములు సమకూర్చారు. దీంతో ఇటీవ ల ప్రభుత్వం మహబూబాబాద్‌ జిల్లాలోని 82, వరంగల్‌రూరల్‌ జిల్లాలోని 74, జనగామ జిల్లాలోని 62, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని 45, వరంగల్‌ అర్బన్‌ జి ల్లాలోని 40, ములుగు జిల్లాలోని 31 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణ పనులు మొద లు పెట్టింది. వీటి నిర్మాణ పనులను పం చాయతీరాజ్‌ (పీఆర్‌) ఇంజినీరింగ్‌ విభా గం పర్యవేక్షిస్తున్నది. ఇటీవలి వర్షాలకు ప నులకు కొంత ఆటంకం కలిగింది. కొద్ది రో జుల నుంచి పనుల్లో వేగం పుంజుకుంది. 

శరవేగంగా వేదికల పనులు..

మహబూబాబాద్‌ జిల్లాలో 13 వేదికల పనులు తుది దశకు చేరాయి. మిగతావి రూఫ్‌, లెంటల్‌, బేస్‌మెంట్‌ లెవల్‌లో ఉ న్నాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మం డలంలోని కోలుకొండ క్లస్టర్‌లో రైతు వేది క నిర్మాణం పూర్తయింది. ఐదింటి నిర్మా ణం తుది దశలో ఉండగా ఇంకో 17 వేదికల పనులు రూఫ్‌ లెవల్‌లో ఉన్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 11 వేదికల క ప్పు పనులు పూర్తయ్యాయి. 12 రూఫ్‌ లె వల్‌, 28 లెంటల్‌ లెవల్‌, 23 బేస్‌మెంట్‌ లెవల్‌లో ఉన్నాయి. వరంగల్‌ అర్బన్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. రూరల్‌ జిల్లాలో నడికూడ మండలంలోని వరికోలులో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి రైతు వేదిక నిర్మాణానికి భూ మి ఇచ్చారు. వరికోలు ఆయన స్వగ్రా మం కాగా, ఆదివారం గ్రామాన్ని సందర్శించి రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన చొరవతో నిర్మాణ పను లు ఫైనల్‌ దశకు చేరాయి. జిల్లాలోని మరో 74 క్లస్టర్లలో పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు పీఆర్‌ ఇంజినీరింగ్‌ విభాగం జిల్లా అధికారి సంపత్‌ వెల్లడించారు. ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వేదికల నిర్మా ణ పనుల పురోగతిపై ఇటీవల కలెక్టర్లు, పీ ఆర్‌ ఇంజినీర్లతో సమీక్ష జరిపారు. దసరాలోగా రెడీ చేయాలని ఆదేశించారు.