గురువారం 26 నవంబర్ 2020
Warangal-rural - Oct 03, 2020 , 02:31:01

6న పాకాలలో బర్డ్‌వాక్‌..

6న పాకాలలో బర్డ్‌వాక్‌..

  • వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభం
  • ఈ నెల 8 వరకు కార్యక్రమాలు: రూరల్‌ డీఎఫ్‌వో అర్పన

ఖానాపురం: వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 6న పాకాలలో నేచర్‌, బర్డ్‌ వాక్‌ నిర్వహించనున్నట్లు వరంగల్‌ రూరల్‌ డీఎఫ్‌వో అర్పన తెలిపారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీని విడుదల చేసి వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏటా అక్టోబర్‌ 2 నుంచి 8 వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాకాల అడవుల్లో ఒకప్పుడు పెద్దపులులు సంచరించేవని గుర్తు చేశారు. రాష్ట్ర ప్ర భుత్వ చర్యలతో అడవులు వృద్ధి చెంది పాకాల పూర్వవైభవం సంతరించుకున్నదని పేర్కొన్నారు. ఫలితంగా జింక లు, కొండ గొర్రెలు, దుప్పులు, ఎలుగుబంట్లు, మొసళ్ల సం ఖ్య ఏటేటా పెరుగుతున్నదని వివరించారు. వారోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు విద్యార్థులకు(6 నుంచి 10వ తరగతి) ఆన్‌లైన్‌లో వైల్డ్‌లైఫ్‌ డ్రా యింగ్‌, ఫొటోగ్రఫీ, క్విజ్‌పోటీలను నిర్వ హిస్తున్నామని తెలిపారు. 6న పాకాలలో నేచర్‌, బర్డ్‌వాక్‌ నిర్వహిస్తామని, 7న విజేతల ప్రకటన, 8న ముగింపు వేడుకలు ఉంటాయని పే ర్కొన్నారు. ఆన్‌లైన్‌ పోటీల్లో పాల్గొనే వారు dfowglrural @gm ail.comలో గానీ 9490117370 సెల్‌ నంబర్‌లో సంప్రదించాలని కోరారు. వరంగ ల్‌, నర్సంపేట ఎఫ్‌ఆర్వోలు రమే శ్‌, రమేశ్‌, డీఆర్వో ఇజాజ్‌, మోహ న్‌, బీట్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

‘స్వచ్ఛ్‌ పాకాల’కు కృషిచేద్దాం

చారిత్రక పాకాలను ప్లాస్టిక్‌ర హితంగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని రూరల్‌ డీఎఫ్‌వో అర్పన అన్నారు. మహా త్మాగాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ్‌ పాకాల నిర్వహించారు. ప రిసర ప్రాంతంలో ప్లాస్టిక్‌ ఏరివేసి పర్యావరణ అధ్యయన కేంద్రం సమీపంలో మొక్కలు నాటారు.