గురువారం 26 నవంబర్ 2020
Warangal-rural - Oct 02, 2020 , 06:21:49

ఏఆర్‌కు హన్మకొండ సీఐ అటాచ్‌

ఏఆర్‌కు హన్మకొండ సీఐ అటాచ్‌

వరంగల్‌ క్రైం : భూ వివాదంలో తలదూర్చినందుకు హన్మకొండ ఎస్‌ఐ దయాకర్‌ను ఏఆర్‌ విభాగానికి అటాచ్‌ చేస్తూ సీపీ ప్రమోద్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హన్మకొండ వికాస్‌నగర్‌లోని ఓ స్థలం విషయంలో ములుగు జిల్లా మచ్చాపురానికి చెందిన రవీందర్‌రెడ్డికి, నయీంనగర్‌ ప్రేమ్‌నగర్‌కాలనీకి చెందిన సోదా కిరణ్‌ మధ్య కొంతకాలంగా వివాదం నెలకొంది.  కిరణ్‌ తన పలుకుబడితో రవీందర్‌రెడ్డిని హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బలవంతంగా సంతకాలు పెట్టించుకునేందుకు ప్రయత్నించాడు. దీనికి సీఐ కూడా వత్తాసు పలికినట్లు తెలిసింది.  సంతకం పెట్టకుంటే సీరియస్‌గా ఉంటుందని తనను సీఐ బెదిరించి కొట్టాడని రవీందర్‌రెడ్డి సీపీకి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సెంట్రల్‌ జోన్‌ ఇన్‌చార్జి డీసీపీ పుష్ప, నర్సంపేట ఏసీపీ ఫణీందర్‌, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ విచారణ జరిపి సీపీకి నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా సీఐతో పాటు సోదా కిరణ్‌, అతడి డ్రైవర్‌, చారి, మరో గుర్తు తెలియని వ్యక్తిపై హన్మకొండ పీఎస్‌లో గురువారం కేసు నమోదు చేశారు. బాధితుడిని కొట్టిన ఘటనలో గన్‌మన్‌ పాత్ర కూ డా ఉన్నట్లు తెలిసి సెంట్రల్‌ జోన్‌ డీసీపీ పుష్ప అతడిని తీవ్రంగా మందలించినట్లు తెలిసింది.