శనివారం 28 నవంబర్ 2020
Warangal-rural - Oct 01, 2020 , 02:20:11

అంగన్‌వాడీ కేంద్రానికి రాష్ట్ర స్థాయి అవార్డు

అంగన్‌వాడీ కేంద్రానికి రాష్ట్ర స్థాయి అవార్డు

నర్సంపేట, సెప్టెంబర్‌ 30 : నర్సంపేటలోని అంగన్‌వాడీ కేంద్రం పోషణ్‌ అభియాన్‌ రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికైంది. నర్సంపేట ప్రాజెక్టు పరిధిలోని 345 సెంటర్లకు గాను నాలుగో సెంటర్‌ను రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికైంది. బుధవారం అంగన్‌వాడీ టీచర్‌, ఆయా, ఆశ, సూపర్‌వైజర్‌, ఏఎన్‌ఎంలకు డీఆర్వో హరిసింగ్‌, జిల్లా సంక్షేమ అధికారి చెన్నయ్య, డీఎంహెచ్‌వో మధుసూదన్‌, సీడీపీవో రాధిక, ఏసీడీపీవో విద్య ప్రశంసా పత్రాలు, రూ.10 వేలు అందించారు. అవార్డులు అందుకున్న వారిలో నల్లాభారతి, ఝాన్సీ, కవిత, సునీత, రాజమణి ఉన్నారు. కార్యక్రమంలో హార్టికల్చర్‌ అధికారి శ్రీనివాస్‌, కార్తీక్‌, విజేందర్‌, శ్రీలత, స్వర్ణలత, పద్మ, భాగ్యలక్ష్మి, పద్మ పాల్గొన్నారు.