ఆదివారం 24 జనవరి 2021
Warangal-rural - Oct 01, 2020 , 02:20:16

పోషణ లోపంతో పుట్టే శిశువుల సంఖ్య తగ్గించాలి

పోషణ లోపంతో పుట్టే శిశువుల సంఖ్య తగ్గించాలి

కలెక్టరేట్‌, సెప్టెంబర్‌ 30 : జిల్లాలో రక్తహీనత, పోషణ లోపంతో పుట్టే శిశువుల సంఖ్య తగ్గించేందుకు ప్రణాళిక లు సిద్ధం చేయటమే కాకుండా నిర్దేశించిన లక్ష్యాలను సా ధించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి భూక్యా హరిసింగ్‌ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లోని కా న్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు, పిల్లల్లో పోష ణ లోపాలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తూ సకాలంలో టీకాలు వేయించాలన్నారు. ఐరన్‌, విటమిన్‌, క్యా ల్షియం మాత్రలను నిర్దేశిత సమయానికి ఆశా కార్యకర్తలు అందించాలన్నారు.

ప్ర భుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. అనంతరం పోషణ మా సం కార్యక్రమంలో భాగంగా 2018- 2019 సంవత్సరానికి గాను ఉత్తమ సేవలు అందించిన అధికారులకు డీఆర్వో అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర చల్లా మధుసూదన్‌, జిల్లా హార్టికల్చర్‌ అధికారి శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి, సీడీపీవోలు పద్మ, రాధిక, స్వర్ణలత, పోష ణ్‌ అభియాన్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ కార్తిక్‌ పాల్గొన్నారు. logo