శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-rural - Sep 30, 2020 , 01:08:41

ట్రాక్టర్‌ ర్యాలీకి భారీ ఏర్పాట్లు

ట్రాక్టర్‌ ర్యాలీకి భారీ ఏర్పాట్లు

వర్ధన్నపేట, సెప్టెంబర్‌ 29: కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతుగా బుధవారం వర్ధన్నపేటలో భారీ ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలాల వారీగా టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులతో ఆయన సమీక్షించారు. నియోజకవర్గ కేంద్రంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి పర్వతగిరి, ఐనవోలు, వర్ధన్నపేట మండలాల రైతులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో బయల్దేరి ర్యాలీగా చేరుకోనున్నట్లు తెలిపారు. సుమారు వెయ్యి నుంచి 12 వందల వరకు ట్రాక్టర్లు వస్తాయని అంచనా వేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు రూట్‌మ్యాప్‌ను ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. ఉదయం 11 గంటలకు ఐనవోలు, పర్వతగిరి, వర్ధన్నపేట మండలాలకు చెందిన ట్రాక్టర్లు ఉప్పరపల్లి క్రాస్‌రోడ్డు వరకు చేరుకుంటాయి. అనంతరం జాతీయ రహదారిపై కట్య్రాల, ఇల్లంద గ్రామాల మీదుగా వర్ధన్నపేటకు చేరుకోనున్నాయి. ప్రతి గ్రామం నుంచి ట్రాక్టర్లు వచ్చేలా చూడాలని ఎమ్మెల్యే రమేశ్‌ పార్టీ శ్రేణులను కోరారు. ట్రాక్టర్ల ర్యాలీ, వర్ధన్నపేట పట్టణంలో జరిగే సభకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర ప్రముఖులు హాజరు కానున్నట్లు ఎమ్మెల్యే రమేశ్‌ తెలిపారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, రైతురుణ విమోచన సమితి చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, ఎంపీపీ అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అరుణ, వైస్‌ చైర్మన్‌ ఎలేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, మాజీ జడ్పీటీసీ సారంగపాణి తదితర నాయకులు పాల్గొన్నారు.

ట్రాక్టర్‌ ర్యాలీని జయప్రదం చేయాలి

పర్వతగిరి: సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతుగా బుధవారం రైతుల ఆధ్వర్యంలో నిర్వహించే ట్రాక్టర్‌ ర్యాలీని జయప్రదం చేయాలని జడ్పీటీసీ బానోత్‌ సింగిలాల్‌ పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్ధన్నపేటలో నిర్వహించే ట్రాక్టర్‌ ర్యాలీకి మండలంలోని రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఆయన వెంట పీఏసీఎస్‌ చైర్మర్లు మనోజ్‌కుమార్‌, గొర్రె  దేవేందర్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ శాంతి రతన్‌రావు, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు సర్వర్‌,  వైస్‌ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌, నాయకులు జితేందర్‌రెడ్డి, ప్రవీణ్‌రావు, యుగేంధర్‌రావు, ఏకాంతంగౌడ్‌, శ్రీనివాస్‌, సోమేశ్వర్‌రావు, పంతులు పాల్గొన్నారు.