మళ్లీ పొంగిన వాగులు, వంకలు

- మత్తళ్లు దుంకుతున్న చెరువులు, కుంటలు
- పర్వతగిరిలో అత్యధిక వర్షపాతం నమోదు
నమస్తే తెలంగాణ నెట్వర్క్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం జోరు వాన కురిసింది. ఉదయం నుంచి చిరుజల్లులు పడగా, సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. సంగెం మండలంలో భారీ వర్షానికి అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మండలంలోని చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తుండగా, శుక్రవారం కురిసిన వర్షంతో మరోసారి అలుగు పారుతున్నాయి.
పత్తిలో పూత రాలే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నారావుపేట మండలంలో వట్టెవాగు, పాకాల వాగు, మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గ్రామాల్లోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. పత్తి చేలు, వరి పొలాల్లో వరదనీరు నిలిచింది. వర్ధన్నపేటలో మధ్యాహ్నం 3.30 గంటలకు భారీ వర్షం కురిసింది. దీంతో మరోసారి వాగులు ప్రవహిస్తున్నాయి. పత్తి పంటకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దామెర మండలంలో మోస్తరు వర్షం కురిసింది. వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు, రైతులు తిరుగుముఖం పట్టి ఇండ్లకు చేరుకున్నారు. పత్తిలో పూత రాలిపోతున్నదని ల్యాదెళ్లకు చెందిన రైతు హింగె శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పర్వతగిరి, మండలవ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లాలోనే అత్యధికంగా మండలంలో 91 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఏనుగల్లులో అత్యధికంగా 129 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షంతో కొంకపాక క్రాస్ నుంచి గ్రామానికి వెళ్లేదారిలో కల్వర్టు, గోపనపల్లి నుంచి అనంతారం గ్రామాలకు వెళ్లే దారిలో కల్వర్టు వద్ద వరద ఉధృతి పెరుగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం గ్రామాలకు చేరుకునే ఆర్టీసీ బస్సు సర్వీసును నిలిపివేశారు.
తాజావార్తలు
- రోడ్డు నిబంధనలు పాటించాలి
- సింగరేణిలో కారుణ్య నియామకాలు
- హోరాహోరీగా..
- రాష్ట్రంలో వ్యాక్సిన్ ఉత్పత్తి గర్వకారణం
- ఘనంగా మల్లన్న పెద్ద పట్నం
- మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే సండ్ర
- ఉమ్మడి జిల్లాలో 1298 మందికి వ్యాక్సిన్
- కేటీపీఎస్ ఏడో దశలో అరుదైన రికార్డు
- టీకాతోనే కరోనా నివారణ
- వ్యాక్సిన్‌పై అవగాహన అవసరం