గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-rural - Sep 26, 2020 , 02:33:25

బండెనక బండి కట్టి.. ప‌బ్బ‌తి క‌ట్టి

బండెనక బండి కట్టి.. ప‌బ్బ‌తి క‌ట్టి

  • అంబరాన్నంటేలా రెవె‘న్యూ’ జాతర
  • కొత్త చట్టంపై అన్నదాతల ఆనందహేల
  • స్వచ్ఛందంగా కదిలివస్తున్న కర్షకులు
  • రాయపర్తిలో మంత్రి ఎర్రబెల్లి నేతృత్వంలో ఎడ్లబండ్లు, కాడెడ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ
  • తరలివచ్చిన 39గ్రామాల రైతులు
  • మరిపెడలో బైలెల్లిన వెయ్యి ట్రాక్టర్లు
  • ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ ఆధ్వర్యంలో సంబురాలు
  •  కృతజ్ఞతలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు
  • దారి పొడువునా ‘కొత్త’ పండుగ చూసి మురిసిన ప్రజలు 

  • ‘జయహో కేసీఆర్‌' అంటూ నినాదాల హోరు

రాయపర్తి/మరిపెడ : కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ కర్షకులు సంబురాలు చేసుకుంటున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి టీఆర్‌ఎస్‌ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో వేలాది మంది రైతులు ఎడ్లబండ్లు, కాడెడ్లు, ట్రాక్టర్లతో శుక్రవారం భారీ ర్యాలీ తీశారు. రాయపర్తి-కొండూరు ప్రధాన రహదారిలో ఎస్సారెస్పీ కాలువపై సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి రైతులు, పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు పాలాభిషేకం చేశారు. ర్యాలీలో మంత్రి ఎర్రబెల్లి ఎడ్లబండి తోలుతూ, ట్రాక్టర్‌ నడుపుతూ రైతులు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

మండల కేంద్రం మీదుగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ దాకా సుమారు ఐదున్నర కిలోమీటర్ల మేర జాతర కొనసాగింది. సంబురాల్లో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్‌, పార్టీ మండలాధ్యక్షుడు మునావత్‌ నర్సింహనాయక్‌, నాయకులు గారె నర్సయ్య, అయిత రాంచందర్‌, పూస మధు, కర్ర రవీందర్‌రెడ్డి, కోదాటి దయాకర్‌రావు, ఎండీ నయీం, కాంచనపల్లి వనజారాణి, ఉస్మాన్‌, బిల్ల సుభాష్‌రెడ్డి, భద్రూనాయక్‌, బోనగిరి ఎల్లయ్య, లేతాకుల యాదవరెడ్డి, గాడిపల్లి వెంకన్న, గబ్బెట బాబు, ఆష్రఫ్‌ పాషా, బొమ్మెర వీరస్వామి, రాజబాబు, బాషబోయిన సుధాకర్‌, శ్రీనివాస్‌రెడ్డి, సారయ్య, అమ్జద్‌పాషా, చిన్నాల శ్రీనివాస్‌, రాజు, ముద్రబోయిన సుధాకర్‌, చందు రామ్‌యాదవ్‌, సత్తూరి నాగరాజు, జక్కుల వెంకట్‌రెడ్డి, కుందూరు రాంచంద్రారెడ్డి, కుంచారపు హరినాథ్‌, కుక్కల భాస్కర్‌, చెవ్వు కాశీనాథం, ఆలకుంట్ల రాజేందర్‌, ఆవుల కేశవరెడ్డి, శ్యామ్‌రావు, బొడ్డు రంగయ్య, జగన్‌నాయక్‌, దీప్లానాయక్‌ పాల్గొన్నారు. 

మరిపెడలో వంద ట్రాక్టర్లతో ..

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మున్సిపల్‌ కేంద్రం లో డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ ఆధ్వర్యంలో రైతులు సుమారు వెయ్యి ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. స్థానిక సాయిబాబా మందిరం నుంచి రాజీవ్‌గాంధీ సెంటర్‌ దాకా నాలుగు కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆటపాటలతో హోరెత్తించారు. మహిళ ప్రజా ప్రతినిధులు నృత్యాలతో అలరించారు. దారి పొడువునా ట్రాక్టర్ల జాతర చూసి పట్టణ ప్రజలు మురిసి పోయారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ ట్రాక్టర్‌ నడిపి రైతులను సంబురంలో ముంచెత్తారు. రైతులు, శ్రేణులతో కలిసి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే రెడ్యా పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గుడిపుడి నవీన్‌రావు, జడ్పీ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ చాపల యాదిగిరెడ్డి, ఎంపీపీలు గుగులోతు అరుణ, వల్లూరి పద్మ, ధరంసోత్‌ బాలునాయక్‌, గుగులోత్‌ పద్మావతి, టేకుల సుశీల, ఓలాద్రి ఉమ, జడ్పీటీసీలు తేజావత్‌ శారద, మూల సునీతారెడ్డి, పొడిశెట్టి కమల, భూక్యా సంగీత, మరిపెడ, డోర్నకల్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గుగులోత్‌ సింధూర, వాంకుడోత్‌ వీరన్న, మరిపెడ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తాళ్లపెల్లి శ్రీనివాస్‌, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు తాళ్లపెల్లి రఘురాం, పీఏసీఎస్‌ అధ్యక్షులు, రైతు బంధు సమితి అధ్యక్షులు, ఆరు మండలాల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు టేకుల యాదగిరిరెడ్డి, ధర్మారపు వేణు, నున్న రమణ, తోట లాలయ్య, రాంసింగ్‌, మైదం దేవేందర్‌, జిల్లా నాయకులు గుగులోతు రాంబాబు, తేజావత్‌ రవీందర్‌నాయక్‌, బాల్ని మాణిక్యం, గుగులోత్‌ వెంకన్న, గుగులోత్‌ రవి, కిశోర్‌, మల్లారెడ్డి, ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, కత్తెరశాల విద్యాసాగర్‌ పాల్గొన్నారు.


logo