శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-rural - Sep 26, 2020 , 02:33:20

ఆరు కిలోల గంజాయి పట్టివేత

ఆరు కిలోల గంజాయి పట్టివేత

కమలాపూర్‌ : మండలంలోని ఉప్పల్‌ గ్రామంలో గంజాయి పట్టుకున్నట్లు సీఐ రవిరాజు శుక్రవారం తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. ఎండీ షమీమ్‌ అనే మహిళ ఏడేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నదన్నారు. లాక్‌డౌన్‌కు ముందు విశాఖపట్నం నుంచి వచ్చిన గంజాయిని ఇంట్లో నిల్వ చేసినట్లు చెప్పారు. నిల్వ చేసిన గంజాయిని అమ్ముకునేందుకు తరలిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్నామన్నారు. ఆరు కిలోల గంజాయి పట్టుకున్నామని, దీని విలువ సుమారు రూ. 60వేలు ఉంటుందన్నారు. షమీమ్‌పై పలు పోలీస్‌ స్టేషన్లలో మూడు కేసులు ఉన్నాయని తెలిపారు. ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ వెల్లడించారు.  


logo