శనివారం 28 నవంబర్ 2020
Warangal-rural - Sep 24, 2020 , 06:10:43

తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం: చల్లా

తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం: చల్లా

  • పరకాల మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆటోల ప్రారంభం

పరకాల టౌన్‌: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం పరకాల మున్సి పాలిటీ పరిధిలో పారిశుధ్య పనుల నిర్వహణకు రూ.75 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 10 స్వచ్ఛ ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్న తే లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల ను ప్రవేశపెట్టారని అన్నారు. అధికారులు స్వచ్ఛ పర కాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, ప్ర జలు తమ వంతుగా చెత్త నిర్వహణలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సోదా అనితారామకృష్ణ, వైస్‌ చైర్మన్‌ రే గూరి విజయపాల్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ యాదగిరి, కౌన్సిలర్లు మడికొండ సంపత్‌కుమా ర్‌, ఒంటేరు సారయ్య, గొర్రె స్రవంతి, దామెర మొగిలి, నల్లెల్ల జ్యోతి, మార్క ఉమాదేవి, చందు పట్ల సుజాతాతిరుపతి రెడ్డి, గ్రంథాలయ సంస్థ చై ర్మన్‌ వినయ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూములను సంరక్షించాలి

ప్రభుత్వ భూములను సంరక్షించేందుకు చర్య లు తీసుకోవాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశించారు. తహసీల్‌ రోడ్డులో ఉన్న మహంకాళి దేవస్థా న పరిసరాలను పరిశీలించడంతో పాటు ప్రభుత్వ భూముల వివరా లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధికి అం దరూ కలిసి రావాలని, ప్రభుత్వ భూముల సంరక్షణకు సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.