గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-rural - Sep 24, 2020 , 06:10:46

ఎమ్మెల్యే పెద్ది చిత్రపటానికి పాలాభిషేకం

ఎమ్మెల్యే పెద్ది చిత్రపటానికి పాలాభిషేకం

  • సొంతంగా ఐసొలేషన్‌ కేంద్రం  ఏర్పాటు చేయడంతో కృతజ్ఞతలు  తెలిపిన కరోనా బాధితులు

నర్సంపేట, సెప్టెంబర్‌23: కరోనా బారిన పడి కోలుకున్న వారందరూ కలిసి బుధవారం నర్సం పేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఏర్పాటు చేసి న హోం ఐసొలేషన్‌ కేంద్రంలో ఆయన చిత్రపటా నికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మానవతా దృక్పథంతో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసొలేష న్‌ సెంటర్‌ ఎంతో మందికి అండగా నిలుస్తోందని అన్నారు. ఐసొలేషన్‌ కేంద్రంలో పౌష్టికాహారం అందిస్తూ స్వయంగా ఎమ్మెల్యేనే వచ్చి మనోధై ర్యం కల్పిస్తున్నారని అన్నారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డి, నర్సంపేట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గోపాల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐసొలేషన్‌ కేర్‌ టేకర్లు సట్ల భిక్షప తి, కటకం అజయ్‌, కరోనాను జయించిన సురేశ్‌, మహబూబ్‌ పాషా, రవీందర్‌, ప్రసాద్‌, ధనలక్ష్మి, రజిత, మహేందర్‌, వెంకన్న, కల్పన, గోపి, తది తరులు పాల్గొన్నారు.


logo