ఉన్నత విద్యకు ‘ఉపకారం’..

- ‘ఎన్ఎంఎంఎస్'తో పేద విద్యార్థులకు స్కాలర్షిప్
- ప్రతిభ చూపిన వారికి నాలుగేళ్లపాటు ఉపకార వేతనం
- 8వ తరగతి విద్యార్థులకు ఆహ్వానం
- దరఖాస్తులకు వచ్చే నెల 4వరకు చివరి గడువు
చెన్నారావుపేట : పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్)ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు అర్హత పరీక్షను నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు నాలుగేళ్ల(9, 10, 11, 12 తరగతులు) పాటు ఏటా ఉపకార వేతనాలు అందిస్తారు. ఈమేరకు విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 4లోగా ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం కల్పించింది.
విద్యార్థులకు ఏటా రూ.12వేలు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి(ఇంటర్ వరకు) ప్రతి ఏడాది రూ.12వేల చొప్పున నాలుగేళ్ల పాటు రూ.48వేలను ఉపకార వేతనంగా అందిస్తారు. ఈ సహాయం పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది.
దరఖాస్తు ఇలా..
దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే చేయాలి. www.bse.telangana.gov.inలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలను జతచేయాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే నెల 5న ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 3న ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఉంటుంది.
తాజావార్తలు
- బీజేపీ బోగస్ మాటలను నమ్మొద్దు : మంత్రి ఎర్రబెల్లి
- గంగానది ప్రశాంతత మంత్రముగ్ధం : ఎమ్మెల్సీ కవిత
- 'విరాటపర్వం' విడుదల తేదీ ఖరారు
- పిల్లల డాక్టరైనా.. విచక్షణ కోల్పోయి..
- కొవిడ్ షాక్ : పసిడి డిమాండ్ భారీ పతనం
- సెంటిమెంట్ ఫాలో అవుతున్న వరుణ్ తేజ్..!
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న కార్తీకదీపం ఫేమ్
- ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆప్ పోటీ
- వేగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ జరుపుతున్న దేశంగా భారత్
- చిల్లరిచ్చేలోపు రైలు వెళ్లిపోయింది... తరువాతేమైందంటే?..